OnePlus 10 Pro : అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ వ‌చ్చేస్తోంది.. విడుద‌ల తేదీ ఎప్పుడంటే..?

OnePlus 10 Pro : మొబైల్స్ త‌యారీ సంస్థ వన్‌ప్ల‌స్ మ‌రో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ పేరిట ఓ కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ నెల 31వ తేదీన నిర్వ‌హించనున్న ప్ర‌త్యేక ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. భార‌త్‌, యూర‌ప్‌ల‌లో ఏక‌కాలంలో ఈ ఈవెంట్ జ‌రుగుతుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం మార్చి 31వ తేదీన రాత్రి 7.30 గంట‌ల‌కు వ‌న్‌ప్ల‌స్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నుంది. అందులోనే వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఇక ఈ ఫోన్‌లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

OnePlus 10 Pro launching in India on March 31st
OnePlus 10 Pro

వ‌న్‌ప్ల‌స్ 10 ప్రొ స్మార్ట్ ఫోన్‌లో.. 6.7 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. అలాగే ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 1 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 8/12జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ఈ ఫోన్ విడుద‌ల కానుంది. ఇందులో ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. మెమొరీ కార్డు వేసుకునేందుకు వీలు లేదు.

ఈ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడు అద‌నంగా మ‌రో 50 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. అలాగే 8 మెగాపిక్స‌ల్ టెలిఫొటో కెమెరా కూడా వెనుక వైపు ఉంది. దీనికి 3.3 ఎక్స్ వ‌ర‌కు ఆప్టిక‌ల్ జూమ్ ల‌భిస్తుంది. ముందు వైపు 32 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ వంటి ఇత‌ర ఫీచ‌ర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని అమ‌ర్చారు. దీనికి 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, 50 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. క‌నుక ఫోన్ వైర్ లేదా వైర్‌లెస్ ఎలా పెట్టినా స‌రే చార్జింగ్ వేగంగా పూర్త‌వుతుంది. ఇక ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

Share
Editor

Recent Posts