చిట్కాలు

Gas Trouble : గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలను క్షణాల్లోనే త‌గ్గించుకోవ‌చ్చు.. అది ఎలాగో తెలుసుకోండి..!

Gas Trouble : అజీర్ణం, కడుపులో మంట, గ్యాస్ సమస్యలు ప్ర‌స్తుతం చాలా మందిని బాధిస్తున్నాయి. వీటికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడల్లా మనలో అధిక శాతం మంది గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడమో, అంటాసిడ్ టానిక్‌లు తాగడమో చేస్తారు. అప్పటికప్పుడు ఇవి ఉపశమనాన్ని కలిగించినా దీర్ఘకాలికంగా వీటిని వాడితే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మనకు లభించే సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి పైన పేర్కొన్న సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అసిడిటీ సమస్య బాధిస్తుంటే చిన్న బెల్లం ముక్కను భోజనం చేసిన ప్రతిసారీ నోట్లో వేసుకుని చప్పరిస్తే సరిపోతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య తొలగిపోతుంది.

2. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. జీర్ణాశయంలో అధికంగా ఉత్పన్నమయ్యే గ్యాస్ కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు జీర్ణం కాకుండా ఉన్న పదార్థాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి.

3. భోజనం చేసిన తరువాత గ్యాస్ అధికంగా వస్తుంటే అందుకు లవంగాలు ఉత్తమమైన పరిష్కారం చూపుతాయి. 2 లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు గ్యాస్ సమస్య ఇట్టే తొలగిపోతుంది. అసిడిటీ నుంచి కూడా బయట పడవచ్చు.

acidity will be reduced easily know how acidity will be reduced easily know how

4. జీర్ణాశయంలో వచ్చే సమస్యలను తొలగించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. కొన్ని తులసి ఆకులను తీసుకుని వాటిని బాగా నలిపి, దానికి కొంత తేనెను జతచేసి ఉదయాన్నే పరగడుపున తాగితే అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలు తొలగిపోతాయి.

5. అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సోంపు బాగా ఉపయోగపడుతుంది. 1 టీస్పూన్ సోంపును భోజనం చేసిన ప్రతిసారీ వేసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్ కూడా తగ్గుతుంది. ఆహారం త్వరగా సులభంగా జీర్ణమవుతుంది.

6. కొద్దిగా పెరుగును తీసుకుని అందులో కీరదోస ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన తరువాత సేవిస్తే అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, అసిడిటీ కూడా తగ్గుతాయి. కడుపులో ఏర్పడే మంటను ఇది తొలగిస్తుంది.

Admin

Recent Posts