న‌ట్స్ & సీడ్స్

Flax Seeds : వీటిని రోజూ గుప్పెడు తినండి చాలు.. ఒక చేప‌ను తిన్నంత లాభం క‌లుగుతుంది..!

Flax Seeds : మ‌న‌కు తినేందుకు అనేక రకాల ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అవిసె గింజ‌లు ఒక‌టి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ అవిసె గింజ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల లాభాలు క‌లుగుతాయి. వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తిన్నా చాలు.. అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవిసె గింజ‌ల‌ను రోజూ సాయంత్రం స్నాక్స్ రూపంలో గుప్పెడు చొప్పున తీసుకోవ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అవిసె గింజ‌ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. ఇవి గుండెను సంర‌క్షిస్తాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని, కంటి చూపును పెంచుతాయి. ఇక ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేప‌ల్లోనూ ఉంటాయి. క‌నుక చేప‌ల‌ను తిన‌లేమ‌ని అనుకునేవారు రోజూ గుప్పెడు అవిసె గింజ‌ల‌ను తిన‌వ‌చ్చు. వీటిని గుప్పెడు తింటే చాలు.. ఒక చిన్న సైజు చేప‌ను తిన్న‌దాంతో స‌మానం. క‌నుక చేప‌ల‌తో స‌మాన‌మైన పోష‌కాల‌ను అవిసె గింజ‌ల ద్వారా మ‌నం పొంద‌వ‌చ్చు.

take flaxseeds daily a handful for many benefits

2. అవిసె గింజ‌ల్లో కాప‌ర్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డ‌మే కాకుండా.. వ్యాధులు రాకుండా చూస్తుంది. ఈ గింజ‌ల్లో ఉండే మాంగ‌నీస్‌, మెగ్నిషియం ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. దీంతో మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

3. అవిసె గింజ‌ల్లో ఉండే సెలీనియం, జింక్ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతాయి. వీర్యం అధికంగా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తాయి. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి.

4. అవిసె గింజ‌ల్లో ఐర‌న్ కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇది ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డేస్తుంది. ర‌క్తం బాగా త‌యార‌య్యేలా చేస్తుంది. అలాగే ఈ గింజ‌ల్లో ఉండే ఫోలేట్ గ‌ర్భిణీల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. ఈ గింజ‌ల‌ను వారు తింటే క‌డుపులోని బిడ్డ‌కు పోష‌ణ స‌రిగ్గా ల‌భిస్తుంది. దీంతో వారిలో పుట్టుక‌తో లోపాలు రాకుండా ఉంటాయి.

5. అవిసె గింజ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. అజీర్ణం, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల నుంచి విముక్తి క‌ల్పిస్తుంది. బ‌రువు త‌గ్గేలా చేస్తుంది. అలాగే ఈ గింజ‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్స‌ర్లు రాకుండా చూస్తాయి. క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటాయి. దీంతో క్యాన్స‌ర్లు రావు.

6. కొలెస్ట్రాల్‌, షుగ‌ర్ లెవ‌ల్స్‌, హైబీపీ ఉన్న‌వారు ఈ గింజ‌ల‌ను రోజూ తింటుంటే దెబ్బ‌కు ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.

అవిసె గింజ‌ల‌ను నేరుగా తిన‌లేని వారు వాటిని కొద్దిగా పెనంపై వేయించి కాస్త ఉప్పు చ‌ల్లి తిన‌వ‌చ్చు. లేదా పొడి చేసి ఏవైనా పండ్ల‌పై చ‌ల్లుకుని లేదా మ‌జ్జిగ‌లో క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు. దీంతో పైన తెలిపిన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Share
Admin

Recent Posts