Aloe Vera For Hair Growth : జుట్టు కూడా మన ముఖానికి ఎంతో అందం తెస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జుట్టు చక్కగా ఉంటేనే మనం అందంగా కనిపిస్తాము. కానీ నేటి తరుణంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు పెరగకపోవడం, జుట్టు నిర్జీవంగా మారడం, చుండ్రు, తల చర్మం నుండి పొట్టు రాలడం వంటి వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టును అందంగా, ఆరోగ్యంగా మార్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ప్రయత్నం ఫలించక ఇబ్బంది పడే వారు మనలో చాలా మంది ఉన్నారు. ఒక చిన్న చిట్కాను ఉపయోగించి మనం జుట్టు సంబంధిత సమస్యలన్నింటిని బయట పడవచ్చు.
ఈ చిట్కాను వాడడం చాలా తేలిక. ఇతర సహాయం లేకుండా ఎవరికి వారే ఈ చిట్కాను ఉపయోగించవచ్చు. అలాగే దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలను కూడా ఎదుర్కొవాల్సి ఉండదు. జుట్టు రాలడాన్ని తగ్గించే చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అలాగే దీనిని ఎలా ఉపయోగించాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను ఉపయోగించడానికి గానూ మనం కేవలం మూడు పదార్థాలనే ఉపయోగించాల్సి ఉంటుంది. ఆయుర్వేద గుణాలు కలిగిన షాంపును లేదా రసాయనాలు తక్కువగా ఉండే షాంపును అలాగే ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును, ఒక టీ స్పూన్ పంచదారను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో మన జుట్టుకు తగినంత షాంపును తీసుకోవాలి. తరువాత ఇందులో కలబంద గుజ్జు వేసి కలపాలి. తరువాత పంచదార వేసి కలపాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. తరువాత 5 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేయాలి. దీనిని పది నిమిషాల పాటు జుట్టుకు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేచాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. కుదుళ్లల్లో పేరుకుపోయిన మురికి, జిడ్డు తొలగిపోతుంది. అలాగే చుండ్రు, పొట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలడం తగ్గి జుట్టు పొడవుగా పెరుగుతుంది. జుట్టు అందంగా, కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వారానికి రెండు సార్లు వాడడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.