Munaga Kaya Pulusu : మన శరీరానికి మునక్కాయలు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. మునక్కాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మునక్కాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. మునక్కాయలతో చేసుకోదగిన వంటకాల్లో మునక్కాయ పులుసు కూడా ఒకటి. ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మునక్కాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునక్కాడ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన మునక్కాయలు – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 5 ( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన పచ్చిమిర్చి – 3, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, మెంతులు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, బెల్లం – ఒక చిన్న ముక్క.
మునక్కాడ పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిన తరువాత కారం వేసి ఒక నిమిషం పాటు కలపాలి. తరువాత మునక్కాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మునక్కాయ ముక్కలను మగ్గించాలి. మునక్కాయ ముక్కలు పూర్తిగా మగ్గిన తరువాత ఒకటిన్నర గ్లాసుల నీళ్లు, చింతపండు రసం, బెల్లం వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి మునక్కాయ ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉడికించాలి. మునక్కాయ ముక్కలు పూర్తిగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునక్కాడ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మునక్కాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పులుసును కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ పులుసును లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.