Back Pain : మనల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలలో నడుము నొప్పి కూడా ఒకటి. ఈ నడుము నొప్పి సమస్య ఒకప్పుడు బాగా వయస్సు మళ్లిన వారిలోనే కనబడేది. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయస్సు వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. స్కూల్‌కు వెళ్లే పిల్లల్లో కూడా మనం ఈ సమస్యను చూడవచ్చు. పోషకాహార లోపం, బయట ఆటలు ఆడకపోవడం, అధిక బరువు ఉన్న బ్యాగులను మోయడం వంటి కారణాల వల్ల పిల్లల్లో మనం ఈ సమస్యను చూడవచ్చు. గంటల కొద్దీ కంప్యూటర్ ల ముందు కూర్చొని పని చేయడం వల్ల కూడా నడుము నొప్పి వస్తుంటుంది. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా కూడా ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య ప్రస్తుత కాలంలో రోజురోజుకీ ఎక్కువవుతోంది. కేవలం నడుము నొప్పే కాకుండా ఇతర కీళ్ల నొప్పులతో బాధపడే వారు కూడా అధికమవుతున్నారు.
ఈ కీళ్ల నొప్పుల సమస్య నుండి బయటపడడానికి అధికంగా ఖర్చు చేస్తుంటారు కూడా. అయినా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. ఈ నడుమునొప్పిని మనం ఆయుర్వేదం ద్వారా కూడా నయం చేసుకోవచ్చు. ఆయుర్వేదం ద్వారా నడుము నొప్పి సమస్య నుండి ఎలా బయటపడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న జిల్లేడు చెట్టును ఉపయోగించి మనం మన నడుము నొప్పిని ఎటువంటి ఖర్చు లేకుండా తగ్గించుకోవచ్చు. గ్రామాలలో కొందరు జిల్లేడు చెట్టును తాకడానికి కూడా భయపడుతూ ఉంటారు. జిల్లేడు చెట్టు దగ్గర దుష్ట శక్తులు ఉంటాయన్న కారణంతో చాలా మంది దాని దరిదాపులల్లోకి కూడా వెళ్లరు. కానీ ఇవి అన్నీ అపోహలే అని, జిల్లేడు చెట్టు కూడా ఇతర చెట్ల లాగా సాధారణమైన చెట్టని, మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ చెట్టు కూడా ఎంతగానో ఉపయోడపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
జిల్లేడు చెట్లు మనకు ఎక్కడపడితే అక్కడ కనబడతాయి. నడుము నొప్పిని తగ్గించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. జిల్లేడు చెట్టును ఏవిధంగా ఉపయోగించడం వల్ల మనం నడుము నొప్పి సమస్య నుండి బయటపడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నడుము నొప్పిని తగ్గించడంలో జిల్లేడు చెట్టు ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. జిల్లేడు చెట్టు ఆకులను సేకరించి శుభ్రపరిచి వాటికి సైంధవ లవణాన్ని కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట ఉంచాలి. ఇలా ప్రతిరోజూ చేస్తూ ఉండడం వల్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి. కేవలం వెన్ను నొప్పే కాకుండా ఇతర కీళ్ళ నొప్పులను తగ్గించడానికి కూడా మనం ఈ జిల్లేడు ఆకుల మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఈ విధంగా జిల్లేడు ఆకులను ఉపయోగించడం వల్ల నడుము నొప్పితోపాటు ఇతర కీళ్ల నొప్పులను కూడా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అయితే జిల్లేడు ఆకులను సేకరించేటప్పుడు వాటి నుండి కారే పాలు కళ్లలో పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.