Maredu Leaves : ఈ ఆకును ప‌ర్సులో పెట్టుకుంటే వ‌ద్ద‌న్నా డ‌బ్బులు వ‌స్తాయి..!

Maredu Leaves : మ‌నం ఎంత క‌ష్ట‌ప‌డినా కూడా మ‌న కుటుంబ‌ స‌భ్యులు క‌ష్ట‌ప‌డ‌కూడ‌ద‌ని, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌కూడ‌ద‌ని ప్ర‌తి ఒక్క‌రూ అనుకుంటూ ఉంటారు. అందుకోసం మ‌నం ఎంతో క‌ష్ట‌ప‌డుతూ ఉంటాం. కానీ కొన్ని సార్లు మ‌నం ఎంత ప్ర‌య‌త్నించినా కూడా మ‌న ద‌గ్గ‌ర డ‌బ్బు నిల‌వ‌దు. మ‌నం సంపాదించిన డ‌బ్బంతా కూడా ఖ‌ర్చై పోతుంది. కొన్నిసార్లు అప్పుల బారిన కూడా ప‌డ‌తారు. ఈ ఆర్థిక స‌మ‌స్యల కార‌ణంగా మాన‌సిక ప్రశాంత‌తను కోల్పోతారు. ఇంట్లో గొడ‌వ‌లు కూడా జ‌రుగుతాయి.

కానీ కొంద‌రు బాగా సంపాదించ‌క పోయిన‌ప్ప‌టికీ వాళ్ల ఇండ్ల‌ల్లో ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు. మ‌నం సంపాదించిన డ‌బ్బులు పూర్తిగా ఖ‌ర్చై పోకుండా, మ‌న ద‌గ్గ‌ర ఉండాలంటే.. అలాగే భ‌విష్య‌త్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గురువారం నాడు ఈ ప‌రిష్కారం చేయాల‌ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గురువారం నాడు ఉద‌యాన్నే స్నానం చేసి మ‌న ద‌గ్గ‌ర్లో ఉండే మారేడు చెట్టు వ‌ద్ద‌కు వెళ్లి ఆ చెట్టుకు నీళ్ల‌ను పోసి, ప‌సుపు, కుంకుమ‌ను రాసి చెట్టు ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి.

put Maredu Leaves in purse for wealth
Maredu Leaves

మారేడు ఆకులు మూడు మూడుగా క‌లిసి ఉంటాయి. ఈ ఆకుల‌ను ఒక్కొక్క‌టిగా వేరు చేయ‌కుండా ఆ మూడు ఆకుల‌ను సేక‌రించి ఆవు పాల‌తో శుభ్ర‌ప‌రిచి డబ్బులు ఉంచే చోట అన‌గా బీరువా లో కానీ, ప‌ర్సులో కానీ ఉంచుకోవాలి. ఒకవేళ మారేడు చెట్టు గ‌న‌క గుడిలో ఉంటే ముందుగా ఆ గుడి చుట్టూ ఐదు ప్ర‌ద‌క్షిణ‌లు చేసిన‌ త‌రువాత ఆ గుడిలో ఉండే హుండీలో ఎంతో కొంత డ‌బ్బును వేసి త‌రువాతే మారేడు ఆకును సేక‌రించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ష్టాలు తొల‌గిపోయి ఆర్థిక ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts