Ayurvedic Remedies For Dengue : డెంగ్యూ జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గాలంటే.. ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..!

Ayurvedic Remedies For Dengue : వ‌ర్షాకాలంలో దోమ బెడ‌ద ఎక్కువ‌గా ఉంటుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెల‌సిందే. దోమ‌ల వ‌ల్ల అనేక విష జ్వ‌రాలు వ‌స్తూ ఉంటాయి. దోమ‌ల కార‌ణంగా వచ్చే విష జ్వ‌రాల్లో డెంగ్యూ కూడా ఒక‌టి. ఈజిప్టు జాతికి చెందిన ఈడెస్ అనే ఆడ దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ జ్వ‌రం వ‌స్తుంది. డెంగ్యూ బారిన ప‌డిన‌ప్పుడు మ‌న‌లో వాంతులు, త‌ల‌నొప్పి, కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు, వికారం, దద్దుర్లు, క‌ళ్ల నొప్పులు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాలు కనిపించిన వెంట‌నే అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కుండా వెంట‌నే చికిత్స తీసుకోవాలి. లేదంటే నీర‌సం, అల‌స‌ట‌, ర‌క్త‌స్రావం, విరోచ‌నాలు, ర‌క్త‌పు వాంతులు, క‌డుపు నొప్పి, చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. వీటిని మ‌రింత నిర్ల‌క్ష్యం చేసే ప్రాణాపాయం కూడా క‌లిగే అవ‌కాశం ఉంది. త‌గిన చికిత్సను తీసుకుంటేనే కొన్ని ఆయుర్వేద చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల డెంగ్యూ జ్వ‌రం నుండి మ‌రింత త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు. డెంగ్యూ జ్వ‌రాన్ని త్వ‌ర‌గా త‌గ్గించే ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డెంగ్యూ జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు మెంతి ఆకుల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల నొప్పులు త‌గ్గుతాయి. మెంతి ఆకుల‌ను నీటిలో వేసి రాత్రంతా నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఈ నీటిని వ‌డ‌క‌ట్టి తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల నొప్పులు త‌గ్గుతాయి. అలాగే నారింజ పండ్ల ర‌సాన్ని తాగాలి. ఈ ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేడెట్ గా ఉంటుంది. అలాగే శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. డెంగ్యూ జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ప్లేట్లెట్స్ త‌గ్గుతాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఈ ప్లేట్లెట్స్ ను పెంచ‌డంలో వేపాకులు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. వేపాకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో వైర‌స్ వ్యాప్తి కూడా త‌గ్గుతుంది. వేపాకుల‌ను నీటిలో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఇక వేపాకుల వ‌లె బొప్పాయి ఆకులు కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. రోజుకు రెండు సార్లు బొప్పాయి ఆకుల‌ను పేస్ట్ గా చేసి తీసుకోవడం వ‌ల్ల డెంగ్యూ లక్ష‌ణాలు త‌గ్గ‌డంతో పాటు శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ప్లేట్లెట్స్ సంఖ్ కూడా పెరుగుతుంది.

Ayurvedic Remedies For Dengue follow these to recover
Ayurvedic Remedies For Dengue

అదే విధంగా డెంగ్యూ జ్వ‌రం బారిన ప‌డిన‌ప్పుడు వాంతులు కూడాఎక్కువ‌గా అవుతూ ఉంటాయి. క‌నుక శ‌రీరం డీహైడ్రేష‌న్ కు గురి అయ్యే అవ‌కాశం ఉంది. క‌నుక కొబ్బ‌రి నీటిని తీసుకోవాలి. కొబ్బ‌రి నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేడెట్ గా ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి కూడా ల‌భిస్తుంది. అలాగే న‌ల్ల మిరియాల పొడిని పాల‌ల్లో వేసి మ‌రిగించి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ప‌లితం ఉంటుంది. ఇన్పెక్ష‌న్ ను తొల‌గించి వైర‌స్ ను న‌శింప‌జేయ‌డంలో ఇది ఎంతో తోడ్ప‌డుతుంది. వీటితో పాటు నిమ్మ‌జాతికి చెందిన ఉసిరి, కివి, బ‌త్తాయి వంటి వాటిని తీసుకోవాలి. కూర‌గాయ‌లతో చేసిన సూప్, పెస‌ర‌ప‌ప్పు సూప్ వంటి వాటిని తీసుకోవాలి. జొన్న రొట్టెల‌ను తీసుకోవాలి. గోధుమ‌రొట్టెల‌ను తిన‌క‌పోవ‌డ‌మే మంచిది. అలాగే డెంగ్యూ జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు జంక్ ఫుడ్ ను, ప్యాకెట్ ఫుడ్ ను తీసుకోకూడ‌దు. ఈ విధ‌మైన ఆహ‌రాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా చాలా త్వ‌ర‌గా డెంగ్యూజ్వ‌రం మ‌రియు దాని ల‌క్ష‌ణాల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

D

Recent Posts