హెల్త్ టిప్స్

Flax Seeds Powder : రోజూ రాత్రి అర టీస్పూన్ పొడిని పాల‌లో క‌లిపి తాగండి.. న‌రాల బ‌ల‌హీన‌త‌లు ఉండ‌వు..

Flax Seeds Powder : తమ‌ జీవన శైలి బట్టి ప్రతి ఒక్కరూ అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. జంక్ ఫుడ్స్ లాంటి వాటికి అలవాటు పడిపోయి పోషకాలను విస్మరిస్తున్నారు. దీని కారణంగా అధిక బరువు పెరుగుతూ డైటింగ్ వంటి అస్తవ్యస్తమైన ప్రణాళికలతో ఆరోగ్యానికి ముప్పు తెచ్చి పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి నరాల బలహీనత వంటి సమస్యలకు లోనవుతున్నారు. ఈ నరాల బలహీనత వల్ల‌ కాళ్లు, చేతులు వణకడం, తక్కువ బరువు ఉన్న వస్తువులు కూడా మోయలేకపోవడం, మాట్లాడుతున్నప్పుడు మాటలు తడబడడం, ఏ చిన్న పని చేద్దామన్నా నీరసంగా ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి.

ఈ నరాల బలహీనత అనేది విటమిన్ బి12 లోపం వల్ల‌ ఏర్పడుతుంది. ఈ లోపం నుంచి బయటపడడానికి ఒక మంచి ఇంటి చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్ లో 10 గ్రాముల మిరియాలు, 10 గ్రాముల బాదం, 10 గ్రాముల దాల్చినచెక్క, 10 గ్రాములు అవిసె గింజలు, 10 గ్రాముల వాల్ నట్స్ వేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి.

Flax Seeds Powder taking this with milk can cure nerve diseases

ఈ పొడిని గాలి చొరబడకుండా గాజు సీసాలో వేసుకొని మూత పెట్టుకొని భద్రపరుచుకోవాలి. ప్రతి రోజూ అర టీస్పూన్ పొడిని గోరువెచ్చని పాలలో కలుపుకొని రాత్రి పూట తాగడం ద్వారా నరాలకు శక్తినిచ్చి, బలహీనతను తగ్గిస్తుంది. ఈ పొడిలో ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, విటమిన్ బి వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ పొడిని రోజూ వాడడం వల్ల‌ మంచి ఫలితం కనబడుతుంది. న‌రాల బ‌ల‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Admin

Recent Posts