Almond Oil For Lips : ఇలా చేస్తే చాలు.. పెద‌వులు పింక్ రంగులోకి మారి అందంగా క‌నిపిస్తాయి..!

Almond Oil For Lips : మ‌నం అందంగా క‌నిపించ‌డంలో మ‌న పెదవులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. పెద‌వులు అందంగా ఉంటేనే మ‌నం మ‌రింత అందంగా క‌నిపిస్తాము. చాలా మందిలో పెద‌వులు న‌ల్ల‌గా ఉంటాయి. పెద‌వుల‌పై మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం, ధూమ‌పానం వంటి వివిధ కార‌ణాల చేత పెద‌వులు న‌ల్ల‌గా మార‌తాయి. చాలా మంది పెద‌వులు అందంగా క‌నిపించ‌డానికి ర‌సాయ‌నాలు క‌లిగిన లిప్ స్టిక్ ల‌ను, లిప్ బామ్ ల‌ను, లిప్ లైన‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటి వ‌ల్ల తాత్కాలికంగా పెద‌వులు అందంగా క‌నిపించిన‌ప్ప‌టికి వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం వ‌ల్ల పెద‌వుల ఆరోగ్యం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో పెదవుల‌ను అందంగా, స‌హ‌జ సిద్దంగా పింక్ రంగులో క‌న‌బ‌డేలా చేసుకోవ‌చ్చు.

ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల పెద‌వుల‌పై ఉండే న‌లుపు, మృత‌క‌ణాలు కూడా తొల‌గిపోతాయి. పెద‌వుల‌ను అందంగా, ఎర్ర‌గామార్చే ఈ చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం బాదం నూనెను, పంచ‌దార‌ను, క‌ల‌బంద జెల్ ను , తేనెను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో అర టీ స్పూన్ పంచ‌దార‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో 6 చుక్క‌ల బాదం నూనెను వేయాలి. త‌రువాత పావు టీ స్పూన్ క‌ల‌బంద జెల్ ను వేసి క‌ల‌పాలి. ఇక చివ‌ర‌గా పావు టీ స్పూన్ తేనెను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని వేలితో తీసుకుని పెదాల‌పై ఒకే దిశ‌లో రాస్తూ నెమ్మ‌దిగా మ‌ర్ద‌నా చేయాలి. ఇలా మూడు నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేసుకున్న త‌రువాత 5 నిమిషాల పాటు దీనిని అలాగే ఉంచాలి.

Almond Oil For Lips use in this way for better effect
Almond Oil For Lips

త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. పెద‌వుల‌ను శుభ్రం చేసుకున్న త‌రువాత వాటిపై పెట్రోలియం జెల్ ను రాసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను వారానికి రెండు సార్లు వాడ‌డం వ‌ల్ల పెద‌వుల‌పై ఉండే న‌లుపు తొల‌గిపోతుంది. పెద‌వుల‌పై ఉండే మృత‌క‌ణాలు తొల‌గిపోతాయి. పెద‌వుల‌కు త‌గినంత తేమ ల‌భించి పెద‌వుల ప‌గుళ్లు త‌గ్గుతాయి. పెద‌వులు స‌హ‌జంగా అందంగా, కాంతివంతంగా, ఎర్ర‌గా త‌యార‌వుతాయి.

D

Recent Posts