Beauty Tips : మీ ముఖంపై ఉండే ఈ విధమైన మచ్చలను ఇలా సింపుల్‌ చిట్కాలతో తొలగించుకోండి..!

Beauty Tips : మ‌న చ‌ర్మంపై క‌ళ్లు, ముక్కు, చెంప భాగాల‌లో తెలుపు రంగులో చిన్న ప‌రిమాణంలో నీటి బుడ‌గ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి. వీటిని మిలియా లేదా పాల మ‌చ్చ‌లు అంటారు. ఇవి చిన్న పిల్ల‌ల్లో ఎక్కువగా క‌నిపిస్తాయి. చ‌ర్మం కింది భాగంలో ఉండే కెరాటిన్ అనే ప్రోటీన్ దెబ్బ తిన‌డం వ‌ల్ల ఈ పాల మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌తాయి. చ‌ర్మానికి సంబంధించిన‌ లేజర్ చికిత్స‌లు తీసుకున్నప్పుడు, స్టెరాయిడ్స్ క‌లిగిన లేప‌నాలు ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల‌, చ‌ర్మానికి సూర్య‌ర‌శ్మి ఎక్కువగా తగిలిన‌ప్పుడు కెరాటిన్ దెబ్బ తిని పాల మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌తాయి. వీటి వ‌ల్ల చ‌ర్మానికి ఎటువంటి హాని క‌ల‌గ‌దు. కానీ ఇవి చూడ‌డానికి మొటిమలుగా ఉండ‌డం వ‌ల్ల చాలా మందిని ఇబ్బందులకి గురి చేస్తాయి. చూసేందుకు అంద విహీనంగా ముఖం ఉంటుంది. అయితే వీటిని ఇంటి చిట్కాల ద్వారా ఎలా త‌గ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Beauty Tips natural home remedies to remove Milia on face
Beauty Tips

1.  పాల మ‌చ్చల‌ను త‌గ్గించ‌డానికి ఓట్స్‌ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఓట్స్‌ను నీటితో క‌లిపి మెత్త‌టి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను పాల మచ్చ‌లు ఉన్న చోట రాసి అరగంట త‌రువాత క‌డిగి వేయాలి. ఇలా త‌రచూ చేయ‌డం వ‌ల్ల పాల మ‌చ్చలు త‌గ్గుతాయి.

2. నీటి ఆవిరితో చాలా సుల‌భంగా పాల మ‌చ్చ‌ల‌ను త‌గ్గించవ‌చ్చు. ఒక పాత్ర‌లో నీటిని బాగా వేడి చేసి ఆ నీటిని వెడ‌ల్పాటి పాత్ర‌లో తీసుకోవాలి. ఇప్పుడు ముఖానికి ఆవిరి త‌గిలేలా కూర్చొని దుప్ప‌టితో మూసివేయాలి. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

3. తేనె వ‌ల్ల పాల మ‌చ్చ‌లు తగ్గ‌డంతోపాటు చ‌ర్మానికి ఎంతో మేలు క‌లుగుతుంది. స‌హ‌జ సిద్ద‌మైన తేనెను పాల మ‌చ్చ‌లు ఉన్న చోట రాసి 20 నిమిషాల త‌రువాత వేడి నీటితో క‌డిగి వేయాలి. ఇలా రోజూ చేయ‌డం వ‌ల్ల ఫ‌లితం ఎక్కువ‌గా ఉంటుంది.

4. పాల మ‌చ్చ‌ల‌ను త‌గ్గించే వాటిల్లో ట‌మాటాలు ఒక‌టి. ఒక ట‌మాటాను తీసుకుని స‌గానికి కట్ చేసి పాల మ‌చ్చ‌ల‌పై నేరుగా రుద్దాలి. 20 నిమిషాల త‌రువాత గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల పాల మ‌చ్చ‌లు త‌గ్గ‌డ‌మే కాకుండా చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది.

5. ఆముదం నూనె వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌యాలు క‌లుగుతాయి. జుట్టు పెరుగుద‌ల‌కు ఎక్కువ‌గా ఆముదం నూనెను ఉప‌యోగిస్తారు. పాల మ‌చ్చ‌లను త‌గ్గించ‌డానికి కూడా ఆముదం నూనెను వాడుతారు. ఒక టీ స్పూన్ చొప్పున ఆముదం నూనెను, ఆలివ్ నూనెను క‌లిపి నేరుగా పాల మ‌చ్చ‌లపై రాసి 10-20 నిమిషాల త‌రువాత వేడి నీటితో క‌డిగేయాలి. దీంతో సమస్య తగ్గుతుంది.

6. నిమ్మ‌కాయ ర‌సంలో ఒక టీ స్పూన్ చ‌క్కెర వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పాల మ‌చ్చ‌ల‌పై వృత్తాకారంలో ఐదు నిమిషాల పాటు రాసి, 15 నిమిషాల త‌రువాత నీటితో క‌డిగేయాలి. ఇలా వారానికి ఒక‌టి లేదా రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల పాల మ‌చ్చ‌లు వేగంగా త‌గ్గుతాయి.

ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల పాల మచ్చ‌లు త‌గ్గ‌డ‌మే కాకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది. మెరుస్తుంది. ముఖంపై ఉండే ఇతర మచ్చలతోపాటు మొటిమలు కూడా తగ్గుతాయి. అందంగా కనిపిస్తారు.

D

Recent Posts