Anchor Varshini : పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు.. అని ప్ర‌శ్నిస్తే.. యాంక‌ర్ వ‌ర్షిణి స‌మాధానం ఇదే..!

Anchor Varshini : యాంక‌ర్ వ‌ర్షిణి ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో చాలా బిజీగా ఉంటోంది. అందాల ఆర‌బోత ఫొటోల‌ను షేర్ చేస్తూ కుర్ర‌కారు మ‌తుల‌ను పోగొడుతోంది. ఈమె బుల్లితెర‌పై ఎలాంటి షోల‌ను చేయ‌డం లేదు. కానీ సినిమాల్లో మాత్రం ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈమ‌ధ్యే సుమంత్ న‌టించిన మ‌ళ్లీ మొద‌లైంది సినిమాలో ఆయ‌న ప‌క్క‌న లీడ్ రోల్‌లో న‌టించింది. ఇక స‌మంత న‌టిస్తున్న శాకుంత‌లం అనే సినిమాలోనూ న‌టించే చాన్స్‌ను ఈమె కొట్టేసింది. దీంతో వ‌ర్షిణి సినిమాల‌తో బిజీగా ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Anchor Varshini  told about her marriage
Anchor Varshini

అయితే స‌హ‌జంగానే హీరోయిన్లు లేదా ఇలాంటి న‌టుల విష‌యానికి వ‌స్తే.. పెళ్లి ఎప్పుడు అవుతుంది ? అని అంద‌రూ ప్ర‌శ్నిస్తుంటారు. వ‌ర్షిణి కూడా ఈ విష‌యంపైనే స్పందించింది. త‌నను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు.. అని ఎవ‌రూ అడ‌గ‌లేదు. కానీ ఒక వేళ ఎవ‌రైనా అలా అడిగితే ఏమ‌ని స‌మాధానం చెబుతుందో.. తెలియ‌జేసింది.

త‌నను ఎవ‌రైనా స‌రే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు.. అని అడిగితే.. అప్పుడు.. మీకు ప‌క్క‌వాళ్ల విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌డం త‌ప్పితే వేరే ప‌నిలేదా.. అని స‌మాధానం చెబుతాన‌ని చెప్పింది. దీంతో వ‌ర్షిణి పెట్టిన ఈ పోస్టు వైర‌ల్ అవుతోంది.

ఇక ప్ర‌భాస్ పెళ్లి విష‌యం లాగే ఈమెను కూడా గ‌తంలో చాలా సార్లు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు.. అని అడిగారు. కానీ ఈమె మీడియాకు దూరంగా ఉంటుండ‌డంతో ఈమెను ఇప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లు అడ‌గ‌డం లేదు. ఇక ఈమె ల‌వ్ ఫెయిల్యూర్ అయింద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈమెకు నిశ్చితార్థం కూడా అయింది. కానీ అది పీటల దాకా వ‌చ్చి ఆగిపోయింది. ఇక ఢీ షో కార‌ణంగా వ‌ర్షిణి, ఆది ల‌వ్ ట్రాక్ వైర‌ల్ అయింది. ఈ క్ర‌మంలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. అప్ప‌ట్లో వార్త‌లు కూడా వ‌చ్చాయి.

Editor

Recent Posts