Curd For Face : ముఖం కాంతివంతంగా, అందంగా, తెల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖం అందంగా కనబడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే క్రీములను, ఫేస్ వాష్ లను, స్క్రబర్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి మనలో చాలా మంది వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చర్మం పొడి బారడం, నల్ల మచ్చలు, మొటిమలు, ఎండ వల్ల చర్మం దెబ్బతినడం, చర్మం పై రంధ్రాలు, చర్మం ముడతలు పడడం వంటి అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా కేవలం మనం ఆహారంగా తీసుకునే పెరుగును ఉపయోగించి ముఖ సౌందర్యాన్ని, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగును ఉపయోగించడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గి చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించి చర్మ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. చర్మ సమస్యలతో బాధపడే వారు పెరుగును ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. పెరుగులో గోధుమపిండిని కలిపి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.
చర్మం పొడిబారడం తగ్గి చర్మం మృదువుగా, తెల్లగా మారుతుంది. అలాగే పెరుగులో పసుపును కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే పెరుగు మరియు దోసకాయను కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారడం తగ్గుతుంది. చర్మం అందంగా తయారవుతుంది. అలాగే పెరుగులో టమాట గుజ్జును కలిపి కూడా ముఖానికి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. అలాగే పెరుగులో నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నుండి జిడ్డు కారడం తగ్గుతుంది. ఈ విధంగా పెరుగును వాడడం వల్ల చర్మ సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి. మొటిమలు, మచ్చలు, నలుపుదనం తగ్గి చర్మం రంగు మెరుగుపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా పెరుగును ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.