Dark Armpits : మనలో చాలా మందికి ముఖం తెల్లగా ఉన్నప్పటికి చంక భాగంలో చర్మం నల్లగా ఉంటుంది. చంక భాగంలో మృతకణాలు పేరుకుపోవడం, ఆభాగంలో సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, చర్మంపై దుమ్ము, ధూళి పేరుకుపోవడం, అలాగే చంక భాగంలో ఎక్కువగా వ్యాక్సింగ్, రేజర్స్ వంటి వాటిని ఉపయోగించడం, అలాగే రసాయనాలు కలిగిన డియోడ్రెంట్ లను వాడడం వంటి వివిధ కారణాల చేత ఆ భాగంలో చర్మం నల్లగా మారుతుంది. చంక భాగంలో చర్మం నల్లగా మారడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేనప్పటికి దీంతో మనకు నచ్చిన దుస్తులు ధరించలేకపోతాము. ఎటువంటి సబ్బులను వాడినప్పటికి మనం నల్లగా మారిన చర్మాన్ని తిరిగి తెల్లగా మార్చుకోలేము.
కానీ చక్కటి ఫలితాలను ఇచ్చే ఒక చిట్కాను వాడి మనం చంక భాగంలో నల్లగా మారిన చర్మాన్ని తిరిగి తెల్లగా మార్చుకోవచ్చు. చంక భాగంలో చర్మాన్ని తెల్లగా మార్చే ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో అర చెక్క నిమ్మరసాన్ని తీసుకోవాలి. నిమ్మరసాన్ని పిండి నిమ్మచెక్కను పక్కకు ఉంచాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ వంటసోడాను వేసి కలపాలి. తరువాత ఇందులో తెల్లగా ఉండే ఏదో ఒక టూత్ పేస్ట్ ను వేసి బాగా కలపాలి. ఇప్పుడు నిమ్మచెక్కను తీసుకుని ఈ మిశ్రమంలో ముంచి చంక భాగంలో 3 నుండి 5 నిమిషాల పాటు సున్నితంగా రుద్దుకోవాలి. దీనిని 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.
ఈ చిట్కాను వాడడం వల్ల చంక భాగంలో చర్మం తెల్లగా మారడంతో పాటు ఆ భాగంలో చర్మానికి ఎటువంటి హాని కలగదు. అలాగే ఈ భాగంలో బ్యాక్టీరియా నశించి చంకల నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది. ఈ చిట్కాను వాడిన చాలా తక్కువ సమయంలోనే చర్మం రంగులో వచ్చిన మార్పును మనం గమనించవచ్చు. ఈ విధంగా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చంక భాగంలో నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.