Nails : మీ గోర్లు అందంగా మారి పొడ‌వుగా పెర‌గాలంటే.. ఇలా చేయాలి..

Nails : మ‌న ఆరోగ్యాన్ని కూడా మ‌న చేతి వేళ్లు కూడా తెలియ‌జేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం కూడా ఆరోగ్యంగా ఉన్న‌ట్లు అని అర్థం. కొంద‌రిలో గోర్లు త్వ‌ర‌గా పెర‌గ‌వు. గోర్లు పెరిగినా కూడా అవి విరిగిపోతూ ఉంటాయి. గోర్లు పెర‌గ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకున్నా, అలాగే గోర్లు కాంతివంతంగా క‌నిపించ‌క‌పోయినా మ‌న శ‌రీరంలో కాల్షియం, ఐర‌న్ లోపం ఉన్న‌ట్లు అని అర్థం. దీని కోసం మ‌నం కాల్షియం, ఐర‌న్ వంటి మిన‌రల్స్ ఎక్కువ‌గా ఉన్నా ఆహారాల‌ను తీసుకోవాలి. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి త‌గినంత కాల్షియం, ఐర‌న్ ల‌భించి మ‌న గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి.

అంతేకాకుండా ప‌లు ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి మ‌న చేతి గోర్లు త్వ‌ర‌గా పెరిగేలా, అందంగా క‌న‌బ‌డేలా, విరిగి పోకుండా ఉండేలా చేసుకోవ‌చ్చు. గోళ్ల‌ను అందంగా, బ‌లంగా మార్చే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఏదైనా ఒక తెల్ల‌ని టూత్ పేస్ట్ ను తీసుకోవాలి. ఈ టూత్ పేస్ట్ ను గోర్ల‌పై రాయాలి. ఇలా రాసిన త‌రువాత పాత బ్ర‌ష్ ను తీసుకుని సున్నితంగా గోర్ల‌పై 2 నుండి 3 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గోర్ల‌పై ఉండే దుమ్ము, ధూళి, మురికి తొల‌గిపోయి గోర్లు స‌హ‌జసిద్ధంగా మెరుస్తూ క‌నిపిస్తాయి. త‌రువాత గోర్ల‌ను శుభ్రంగా నీటితో క‌డుక్కోవాలి.

follow this wonderful remedy for beautiful Nails
Nails

త‌రువాత గోర్ల‌పై పెట్రోలియం జెల్లీ రాస్తూ 5 నిమిషాల పాటు సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌గినంత తేమ ల‌భించి గోర్లు విరిగిపోకుండా ఉంటాయి. త‌రువాత గోర్ల‌ను వేడి నీటితో శుభ్ర‌ప‌రుచుకోవాలి. త‌రువాత గోర్ల‌పై అర చెక్క నిమ్మ‌కాయ‌తో సున్నితంగా మ‌రో 5 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాడైపోయిన గోర్లు తిరిగి ఆరోగ్యంగా, దృఢంగా త‌యార‌వుతాయి. ఇలా నిమ్మ‌కాయ‌తో మ‌ర్ద‌నా చేసిన త‌రువాత గోర్ల‌ను 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

5 నిమిషాల త‌రువాత తిరిగి గోర్ల‌ను నీటితో శుభ్రంగా క‌డుక్కోవాలి. త‌రువాత ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్ ను గోర్ల‌కు రాయాలి. ఈ విధంగా ఈ చిట్కాను వారం రోజుల పాటు పాటించ‌డం వ‌ల్ల గోర్ల స‌మ‌స్య‌లు త‌గ్గి గోర్లు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా త‌యార‌వుతాయి. అంతేకాకుండా గోర్లు దృఢంగా కూడా మార‌తాయి. ఈ విధంగా ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌క్క‌ని ఆరోగ్య‌వంత‌మైన గోర్ల‌ను మ‌న సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts