అందానికి చిట్కాలు

క‌ల‌బంద గుజ్జును స్త్రీలే కాదు, పురుషులు ముఖానికి రోజూ రాసుకోవ‌చ్చు.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

క‌ల‌బంద గుజ్జు వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. శ‌రీరానికే కాదు, అందానికీ క‌ల‌బంద ఎంత‌గానో మేలు చేస్తుంది. చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో క‌ల‌బంద బాగా స‌హాయ ప‌డుతుంది. క‌ల‌బంద గుజ్జులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. క‌ల‌బంద గుజ్జును రోజూ ముఖానికి రాయ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of aloe vera gel for face beauty

1. చ‌ర్మానికి తేమ అందించేందుకు చాలా మంది ముఖానికి ఏవేవో మాయిశ్చ‌రైజింగ్ క్రీములు రాస్తుంటారు. కానీ అందుకు అంత‌లా ఖ‌ర్చు చేయాల్సిన ప‌నిలేదు. సింపుల్‌గా రోజూ ముఖానికి క‌ల‌బంద గుజ్జు రాస్తే చాలు. చ‌ర్మం తేమ‌గా మారుతుంది. మృదువుగా ఉంటుంది. చ‌ర్మానికి కావ‌ల్సిన తేమ క‌ల‌బంద గుజ్జు ద్వారా ల‌భిస్తుంది. మ‌హిళ‌లే కాదు పురుషులు కూడా ముఖానికి రోజూ క‌ల‌బంద గుజ్జును రాసుకోవ‌చ్చు. దీంతో చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది.

2. ఎండ‌లో బాగా తిర‌గ‌డం వ‌ల్ల కొంద‌రి చ‌ర్మం కందిపోయిన‌ట్లు ఎర్ర‌గా మారుతుంది. కొంద‌రి ముఖ చ‌ర్మం న‌ల్ల‌గా అవుతుంది. అయితే క‌ల‌బంద గుజ్జును రాయ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీని వ‌ల్ల కందిపోయిన చ‌ర్మం తిరిగి సాధార‌ణ స్థితికి చేరుకుంటుంది. క‌ల‌బంద గుజ్జును ముఖానికి రాసి 30 నిమిషాల త‌రువాత క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం పూర్వ స్థితికి వ‌స్తుంది.

3. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల ఎవ‌రి ముఖంలో అయినా స‌రే ముడ‌త‌లు ఏర్ప‌డుతుంటాయి. వృద్ధాప్య ఛాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటాయి. ముడ‌తు, మ‌చ్చ‌లు, గీత‌లు ఏర్ప‌డుతాయి. చర్మం సాగిపోయిన‌ట్లు అవుతుంది. కానీ క‌ల‌బంద గుజ్జును రోజూ ముఖానికి రాయ‌డం వ‌ల్ల అలాంటి ముడ‌త‌లు, గీత‌లు ఏవీ ఏర్ప‌డ‌వు. ముఖం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు. క‌ల‌బంద గుజ్జులో విట‌మిన్లు సి, ఇల‌తోపాటు బీటా కెరోటిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చ‌ర్మానికి మెరుపును అందిస్తాయి. వృద్ధాప్య ఛాయ‌ల‌ను క‌న‌ప‌డ‌నీయ‌వు.

4. మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు రోజూ క‌ల‌బంద గుజ్జును మొటిమ‌ల‌పై రాస్తే కొద్ది రోజుల్లోనే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. క‌ల‌బంద గుజ్జు చ‌ర్మ వాపుల‌ను త‌గ్గిస్తుంది. దీంతో మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. దుర‌ద త‌గ్గుతుంది. చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

5. ముఖంపై కూడా కొంద‌రికి స్ట్రెచ్ మార్క్స్ క‌నిపిస్తుంటాయి. ఇవి వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ క‌ల‌బంద గుజ్జును రోజూ సంబంధిత ప్ర‌దేశాల‌పై రాయ‌డం వ‌ల్ల ఆ మార్క్స్ త‌గ్గుతాయి. ముఖ చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts