భారతీయులందరి ఇళ్లలోనూ పెరుగు సహజంగానే ఉంటుంది. చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. భోజనం చివర్లో పెరుగు తినకపోతే కొందరికి భోజనం ముగించిన భావన కలగదు. పెరుగును తినడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల దీన్ని రోజూ తీసుకోవాలి.
కాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్లు, లాక్టోజ్ వంటి పోషకాలు పెరుగులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో అవసరం. అందువల్ల పెరుగును రోజూ కచ్చితంగా తినాలి.
పెరుగును మధ్యాహ్న సమయంలో భోజనంతోపాటు తినడం మంచిది. దీంతో శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. మధ్యాహ్నం పెరుగును తినడం వల్లే ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి పూట పెరుగును తింటే శరీరంలో శ్లేష్మం తయారవుతుంది. కనుక మధ్యాహ్నం పెరుగును తినాల్సి ఉంటుంది.
పెరుగును తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. పెరుగులో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. బరువు నియంత్రణలో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ పెరుగును తీసుకోవాలి. పెరుగును రైతా లేదా లస్సీ రూపంలోనూ తీసుకోవచ్చు.
పెరుగు అద్బుతమైన ప్రొ బయోటిక్స్ ఆహారం అని చెప్పవచ్చు. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాలను తాగలేని వారు పెరుగును తీసుకోవచ్చు. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగును రోజూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు రోజూ ఒక కప్పు పెరుగు తినాలి. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. పెరుగును మధ్యాహ్నం తింటే మేలు జరుగుతుంది.
గ్యాస్, మలబద్దకం సమస్యలు చాలా మందికి వస్తున్నాయి. అలాంటి వారు రోజూ పెరుగును తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. పెరుగులో ఉండే పోషకాలు గ్యాస్‌ను తగ్గిస్తాయి. మలబద్దకం రాకుండా చూస్తాయి.
పెరుగును రోజూ తినడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. దీంట్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. అందువల్ల హైబీపీ ఉన్నవారు రోజూ పెరుగు తినాలి. పెరుగును రోజూ తినే పురుషుల్లో వీర్యం నాణ్యత పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. కనుక పెరుగు పురుషులకు చక్కని ఆహారం అని చెప్పవచ్చు.
రోజూ అనేక మంది ఒత్తిడి, ఆందోళనలతో సతమతం అవుతుంటారు. అలాంటి వారు రోజూ పెరుగును తింటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. పెరుగు శరీరానికి శక్తిని అందిస్తుంది. టెన్షన్ లేకుండా ఉండవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365