Honey And Turmeric Face Pack : ముఖం అందంగా కనబడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మార్కెట్ లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడడంతో పాటు బ్యూటీ పార్లర్ లకు కూడా వెళ్లూ ఉంటాము. అందంగా కనబడడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాము. మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదనే చెప్పవచ్చు.అయినప్పటికి మనలో చాలా మంది మొటిమలు, మచ్చలు, చర్మం ముడతలు పడడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం రెండే రెండు పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా ముఖాన్ని అందంగా, తెల్లగా మార్చుకోవచ్చు.
ఈ పదార్థాలను వాడడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ చర్మం బిగుతుగా తయారవుతుంది. ముడతలు తొలగిపోతాయి. ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడం చాలా సులభం కూడా. ముఖాన్ని అందంగా మార్చే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి… మనం ఉపయోగించాల్సిన ఆ రెండు పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం పసుపును, తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ముఖానికి సరిపడా పసుపును కళాయిలో వేసి దోరగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తగినంత తేనె కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుని అరగంట పాటు అలాగే ఉంచాలి.
తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. పసుపు, తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ముఖంపై మచ్చలు, మొటిమలను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. ఈ విధంగా ఈ చిట్కాను వారానికి రెండు నుండి మూడుసార్లు వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ముఖం అందంగా కనబడాలనుకునే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.