Sweet Leaf : బియ్యం పిండితో ఇలా స్వీట్ చేస్తే.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇలాగే చేసుకుని తింటారు..!

Sweet Leaf : మ‌నం పెస‌ర‌పప్పుతో కూర‌లే కాకుండా తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పెస‌ర‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో స్వీట్ లీఫ్ కూడా ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పుతో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, స్పెష‌ల్ డేస్ లో ఇలా ఈ తీపి వంట‌కాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ లీఫ్ అనే తీపి వంట‌కాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ లీఫ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెస‌ర‌ప‌ప్పు – ఒక క‌ప్పు, పాలు – ఒక క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, బియ్యంపిండి – ఒక కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్స్, పంచ‌దార – 2 క‌ప్పులు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, కుంకుమ పువ్వు – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Sweet Leaf recipe in telugu make in this way
Sweet Leaf

స్వీట్ లీఫ్ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో పెస‌ర‌ప‌ప్పు వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత దీనిని గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా క‌డడిగి నీళ్లు తీసేసి ప‌క్కకు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో పాలు, నీళ్లు పోసి వేడి చేయాలి. పాలు వేడయ్యాక క‌డిగిన పెస‌ర‌ప‌ప్పు వేసి మూత పెట్టాలి. దీనిని మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ప‌ప్పును మెత్త‌గా ఉడికించాలి. ప‌ప్పు ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత దీనిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ఒక క‌ప్పు పాలు, ఒక క‌ప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. పాలు వేడ‌య్యాక బియ్యంపిండి వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పెస‌ర‌ప‌ప్పు మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. ఇందులోనే నెయ్యి వేసి క‌ల‌పాలి.

ఈ మిశ్ర‌మం కళాయికి అంటుకోకుండా వేర‌య్యే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిని చ‌ల్లారే వ‌ర‌కు ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో పంచ‌దార‌, నాలుగు క‌ప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే యాల‌కుల పొడి, కుంకుమ పువ్వు వేసి క‌ల‌పాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత మ‌ధ్య‌స్థ మంట‌పై 5 నుండి 8 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతుల‌కు నూనె రాసుకుంటూ నిమ్మకాయంత పిండిని తీసుకుని ఆకు కారంలో వ‌త్తుకోవాలి. త‌రువాత స్పూన్ లేదా క‌త్తితో గాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ముందుగా త‌యారు చేసుకున్న ఆకుల‌ను వేసి వేయించాలి.

వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని కాల్చుకున్న త‌రువాత పాకం వేసి పాకాన్ని రెండు వైపులా ప‌ట్టించాలి.త‌రువాత మూత పెట్టి అర‌గంట నుండి గంట పాటు అలాగే ఉంచాలి. త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ లీఫ్ త‌యార‌వుతుంది. వీటిని లీఫ్ ఆకారంలోనే కాకుండా మ‌న‌కు న‌చ్చిన ఆకారంలో వ‌త్తుకోవ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు రుచిగా స్వీట్ లీప్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts