తేనె ప్రకృతిలో తయారయ్యే అత్యంత సహజసిద్ధమైన పదార్థం. ఎన్ని సంవత్సరాలైనా అలాగే చెక్కు చెదరకుండా నిల్వ ఉంటుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. తేనె వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. తేనెతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. తేనె వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. దీని వల్ల తేనె చర్మ సమస్యలకు బాగా పనిచేస్తుంది.
మొటిమలు, మచ్చలు తగ్గించడంలో, చర్మాన్ని మెరిసేలా చేయడంలో తేనె పనిచేస్తుంది. పలు చర్మ సమస్యలను కూడా తేనె తగ్గిస్తుంది.తేనెను ఉపయోగించడం వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.
1. ఒక టీస్పూన్ తేనెను తీసుకుని ముఖానికి రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.
2. ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ, ఒక టీస్పూన్ తేనె, ఒక గుడ్డు పచ్చ సొన కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత కడిగేయాలి. వారంలో 2-3 సార్లు ఇలా చేస్తే ముఖం మెరుస్తుంది.
3. కొద్దిగా తేనె, ఆలివ్ నూనెలను తీసుకుని కలిపి మిశ్రమంగా చేయాలి. దాన్ని ముఖానికి రాసి కొంత సేపటి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై ఉండే మేకప్ తాలూకు ఛాయలు పోవడంతోపాటు మొటిమలు తగ్గుతాయి.
4. రెండు టేబుల్ స్పూన్ల బాదం పొడి, తేనెలను కలిపి మిశ్రమంగా చేసి ముఖంపై రాయాలి. తరువాత కొంత సేపు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. చర్మంపై ఉండే మృతకణాలు పోతాయి. చర్మానికి తేమ లభిస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది.
5. ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, నిమ్మరసంలను కలిపి చర్మంపై రాయాలి. 20 నిమిషాల తరువాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే చర్మం మృదువుగా, తేమగా మారుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365