ప్రో బ‌యోటిక్స్ ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు..!

మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల ఆహార ప‌దార్థాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప్రోబ‌యోటిక్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాలు ఒక‌టి. ఇవి జీర్ణ వ్య‌వ‌స్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. క‌నుక ప్రో బ‌యోటిక్స్ ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో రెండు ర‌కాల బాక్టీరియాలు ఉంటాయి. ఒక‌టి మంచి బాక్టీరియా అయితే ఇంకోటి చెడు బాక్టీరియా. మంచి బాక్టీరియా మ‌నకు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. క‌నుక ఆ బాక్టీరియా ఎక్కువ‌గా వృద్ధి చెందాలంటే ప్రో బ‌యోటిక్స్ ఆహారాల‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో చెడు బాక్టీరియా న‌శిస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. పెరుగు, ఊరగాయలు, ఇడ్లీ, మజ్జిగ, పనీర్, ప‌చ్చి బఠానీలను ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాల‌ని చెప్ప‌వ‌చ్చు. అందువ‌ల్ల వీటిని త‌ర‌చూ తీసుకోవాలి.

health benefits of eating pro biotic foods

1. మ‌న‌లో అధిక శాతం మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. అలాంటి వారు ప్రో బ‌యోటిక్స్ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉంటుంది. బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.

2. ప్రో బ‌యోటిక్స్ అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అంటువ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

3. ప్రో బ‌యోటిక్స్ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం. అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

4. చిన్న పేగులు, పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రో బ‌యోటిక్స్ ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. దీంతో ఆయా భాగాలు దృఢంగా మారుతాయి. ఇన్‌ఫెక్ష‌న్‌లు రావు.

5. ప్రోబయోటిక్ ఆహారాలె దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడుతాయి. రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం వాటికి ఉంది. క‌నుక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి ఈ ఆహారాలు మేలు చేస్తాయి. హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తులలో మంటను తగ్గించడానికి, రోగనిరోధకత‌ను మెరుగుపరచడానికి ప్రోబయోటిక్స్ సహాయపడతాయని ఒక అధ్యయనం ద్వారా వెల్ల‌డైంది. క‌నుక ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

6. రోజువారీ ఆహారంలో ప్రోబయోటిక్‌లను చేర్చడం వ‌ల్ల‌ అంటువ్యాధులు రావు. ఇత‌ర అనారోగ్యాల నుండి త్వరగా కోలుకోవడానికి ఇవి సహాయపడుతాయి. అలాగే లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ అని పిలువబడే బాక్టీరియా రోగనిరోధకత‌ను మెరుగుపరుస్తుంది. కాబట్టి అనారోగ్యాలకు వ్యతిరేకంగా సహజమైన‌ నిరోధకత పెరుగుతుంది. విటమిన్ ఇ, ఐరన్, సెలీనియం వంటి సూక్ష్మపోషకాలు ఉంటాయి క‌నుక జలుబు, ఫ్లూ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

7. జీర్ణాశ‌యంలో ఉండే మంచి బాక్టీరియా నాడీ వ్యవస్థతో అనుసంధానం అవుతాయి. దీంతో మెదడు నుండి పంపే ప్రతి సందేశం, చర్యను ప్రభావితం అవుతాయి. కాబట్టి ప్రోబయోటిక్స్ సహాయంతో జీర్ణాశ‌యంలోని మంచి బాక్టీరియాను పెంచినప్పుడు పరస్పర చర్యను పెంచడంలో, ఆందోళన, ఒత్తిడి, నిరాశను తగ్గించడంలో ఇవి సహాయపడుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts