Mint Leaves Face Pack : ఈ ప‌వ‌ర్‌ఫుల్ ఫేస్‌ప్యాక్‌తో మీ ముఖాన్ని అందంగా, తెల్ల‌గా మార్చుకోండి..!

Mint Leaves Face Pack : మ‌నం వంట‌ల్లో పుదీనాను కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. పుదీనా చ‌క్క‌టా వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. దీనిని వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. పుదీనాలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. పుదీనాను వాడ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌న ద‌రి చేరుకుండా చేసుకోవ‌చ్చు. కేవ‌లం మ‌న ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలోనే కాదు మ‌న అందాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా పుదీనా మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. పుదీనాను వాడ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే న‌లుపును, ట్యాన్ ను తొల‌గించుకోవ‌చ్చు.

అంతేకాకుండా పుదీనాను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గి చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. అయితే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో పుదీనా మ‌న‌కు ఎలా స‌హాయ‌ప‌డుతుంది.. దీనిని ఎలా ఉప‌యోగించాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తాజాగా ఉండే గుప్పెడు పుదీనా ఆకుల‌ను తీసుకుని శుభ్రం క‌డ‌గాలి. త‌రువాత వీటిని పేస్ట్ లాగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ పంచ‌దార వేసి బాగా క‌లపాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని 5 నిమిషాల పాటు సున్నితంగా మ‌ర్ద‌నా చేసుకోవాలి.

Mint Leaves Face Pack how to use it
Mint Leaves Face Pack

ఈ మిశ్ర‌మం పూర్తిగా ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా పుదీనాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాలు, నలుపు, మురికి తొల‌గిపోయి చ‌ర్మం అందంగా మారుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటించ‌డం వ‌ల్ల ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది. అంతేకాకుండా చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

D

Recent Posts