Pomegranate Peel For Face : దానిమ్మ పండు తొక్క‌ల‌తో ఇలా చేస్తే.. ఇక బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్ల‌రు..!

Pomegranate Peel For Face : చూడ‌డానికి ఎర్ర‌గా ఉండి వెంట‌నే తినాల‌నిపించే పండ్ల‌ల్లో దానిమ్మ పండు ఒక‌టి. ఇవి మ‌న‌కు అన్నీ కాలాల్లో విరివిరిగా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి.దానిమ్మ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. దానిమ్మ పండ్ల‌ను ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, రక్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో, గ‌ర్భిణీ స్త్రీల‌కు త‌గినంత ఫోలిక్ యాసిడ్ ను అందించ‌డంలో దానిమ్మ మ‌నకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే దానిమ్మ‌ను ఒలిచ గింజ‌ల‌ను తీసుకుని అంద‌రూ తొక్క పారేస్తూ ఉంటారు.

కానీ దానిమ్మ గింజ‌ల‌తో పాటు దానిమ్మ తొక్క కూడా మ‌న‌క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దానిమ్మ తొక్క‌లో ఉండే ఔష‌ధ గుణాలు మ‌న‌కు చ‌ర్మాన్ని, జుట్టును అందంగా, ఆరోగ్యంగా మార్చ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డతాయి. దానిమ్మ తొక్క వ‌ల్ల మ‌న‌కుక‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ తొక్క‌ను స‌న్ స్క్రీన్ గానూ, మాయిశ్చ‌రైజ‌ర్ గానూ, స్క్ర‌బ‌ర్ గానూ ఉప‌యోగించ‌వ‌చ్చు. దానిమ్మ తొక్క‌లో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మానికి మ‌రియు తొక్క‌కు చ‌క్క‌టి పోష‌కాల‌ను అందిస్తాయి. దీని తొక్క‌ను ఎండ‌బెట్టి పొడిగా చేసి గాలి నిల్వ చేసుకోవ‌చ్చు. దానిమ్మ తొక్క‌ల పొడికి నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి ముఖానికి ప‌ట్టించాలి. ఆరిన త‌రువాత నీటితో క‌డిగి వేయాలి.

Pomegranate Peel For Face know how to use it
Pomegranate Peel For Face

ఇలా చేయ‌డం వ‌ల్ల మొట‌మ‌లు, మ‌చ్చలు త‌గ్గుతాయి. దానిమ్మ తొక్క‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మొటిమ‌ల‌కు కార‌ణ‌మ‌య్యే బ్యాక్టీరియాను న‌శింప‌జేసి మొటిమ‌లు త‌గ్గేలా చేస్తుంది. అలాగే వృద్ధాప్య ఛాయ‌ల‌ను త‌గ్గించే గుణం కూడా దానిమ్మ తొక్క‌ల‌కు ఉంది. దానిమ్మ తొక్క‌ల పొడిలో కొద్దిగా పాలు క‌లిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి ఆరిన త‌రువాత క‌డిగి వేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం పై ఉండే ముడ‌త‌లు, చార‌లు తొల‌గిపోయి చ‌ర్మం బిగుతుగా త‌యార‌వుతుంది. దానిమ్మ తొక్క‌ల పొడి స‌న్ స్క్రీన్ లోష‌న్ గా ప‌ని చేస్తుంది. ఇది ఎండ వ‌ల్ల చ‌ర్మం న‌ల్ల‌గా మార‌కుండా చేస్తుంది. అలాగే హానిక‌ర‌మైన యువీ కిర‌ణాల నుండి చ‌ర్మానికి ర‌క్ష‌ణ క‌లిగిస్తుంది. దానిమ్మ తొక్క‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మ క్యాన్స‌ర్ కు వ్య‌తిరేకంగా పని చేస్తాయని నిపుణులు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

దానిమ్మ తొక్క‌ల పొడి స‌హ‌జ‌సిద్ద‌మైన స్క్ర‌బ‌ర్ గా కూడా ప‌ని చేస్తుంది. చ‌ర్మం ఉండే మృత క‌ణాల‌ను, బ్లాక్ హెడ్స్ ను నివారించ‌డంలో కూడా దానిమ్మ తొక్క‌ల పొడి మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో,చుండ్రును నివారంచ‌డంలో, జుట్టును ధృడంగా ఆరోగ్యవంతంగా చేయ‌డంలో కూడా దానిమ్మ తొక్క‌ల పొడి మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. చ‌ర్మానికి త‌గినంత తేమ‌ను అందించి చ‌ర్మం పీ హెచ్ స్థాయిల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డంలో ఈ పొడి మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఈ విధంగా దానిమ్మ తొక్క‌ల పొడి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని వాడ‌డం వల్ల మ‌నం చ‌క్క‌టి చ‌ర్మ సౌంద‌ర్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts