Skin Tips : మనలో చాలా మందికి చంకలు, గజ్జల భాగాలలో చర్మం నల్లగా ఉంటుంది. ఈ భాగాలలో చర్మాన్ని తెల్లగా మార్చడానికి మనం రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ చర్మం రంగు మారదు. సహజ సిద్దంగా ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం వంటింట్లో ఉండే పదార్థాలను ఉపయోగించే ఈ భాగాలలోని చర్మాన్ని మనం తెల్లగా మార్చుకోవచ్చు. చంకలు, గజ్జలు వంటి భాగాలలో చర్మాన్ని రెండు ఇంటి చిట్కాల ద్వారా మనం తెల్లగా మార్చుకోవచ్చు. అందులో భాగంగా మొదటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గజ్జలు, చంకల్లో చర్మం తెల్లగా అయ్యేందుకు పాటించాల్సిన మొదటి చిట్కా ఇది. పంచదారను, టమాటను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక టమాటాను తీసుకుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పడు ఒక ప్లేట్ లో పంచదారను తీసుకుని కట్ చేసిన టమాట సగ భాగానికి పంచదారను అద్ది చంక, గజ్జల భాగాలలో 5 నిమిషాల పాటు మర్దనా చేసి అర గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల నల్లగా ఉండే చర్మం తెల్లగా మారుతుంది. అంతే కాకుండా చర్మం పై ఉండే మృత కణాలు కూడా తొలగిపోతాయి.
ఇప్పుడు రెండవ చిట్కా గురించి తెలుసుకుందాం. ఇందు కోసం మనం శనగ పిండి, బియ్యం పిండి, బంగాళా దుంప, టమాటను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా టమాటను గుజ్జుగా చేసుకోవాలి. తరువాత బంగాళా దుంప నుండి రసాన్ని తీసుకోవాలి. దీని కోసం బంగాళా దుంపను ముక్కలుగా జార్ లో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు వస్త్రంలో లేదా జల్లి గంటలో వేసి రసాన్ని పిండుకోవాలి. ఒక గిన్నెలో నాలుగు టీ స్పూన్ల శనగ పిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 4 టీ స్పూన్ల టమాట గుజ్జు, 2 టీ స్పూన్ల బంగాళా దుంప రసాన్ని వేసి ప్టేస్ లా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను చంక, గజ్జల భాగాలలో 5 నిమిషాల పాటు రాసుకోవాలి. అర గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల నల్లగా ఉండే చర్మం తెల్లగా మారుతుంది.
పైన చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల చాలా తక్కువ ఖర్చుతో, చర్మానికి ఎటువంటి హాని కలగకుండా నల్లగా ఉండే చర్మాన్ని తెల్లగా చాలా సులభంగా మార్చుకోవచ్చు. దీంతోపాటు చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది.