అందానికి చిట్కాలు

చ‌ర్మ సౌంద‌ర్యానికి ఈ పండ్లు మేలు..!

మ‌హిళ‌ల‌కు స‌హ‌జంగానే అందం ప‌ట్ల ఎక్కువ ఆస‌క్తి ఉంటుంది. అందుక‌నే వారు ర‌క ర‌కాల బ్యూటీ ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్తుంటారు. కానీ అదంతా ఖ‌రీదైన వ్య‌వ‌హారం. అంత డబ్బు ఖర్చుపెట్టకుండా చక్కగా మీకు అందుబాటులో ఉండే మూడు రకాల పండ్ల‌తో సహజసిద్ధమైన అందాన్ని సొంతం చేసుకో వచ్చు. వీటి ధరలు కూడా మరీ ఎక్కువేం ఉండవు కనుక అన్ని తరగతుల వారూ ప్రయత్నించొచ్చు. వీటిని తినడంతో పాటు ముఖానికి రాసుకోవడం వల్ల అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతమవుతాయి.

use these 3 fruits for facial beauty

1. అరటిపండ్లు

పాదాలు పగిలిపోయి నొప్పితో బాధిస్తున్నాయా ? అయితే వెంటనే ఒక అరటిపండుని తీసుకుని గుజ్జుని పగుళ్లపై రాయండి. 10 నిమిషాల తరువాత వేడినీటితో, తరువాత చల్లని నీటితో కడగండి. ఇలా చేస్తూ ఉంటే పగుళ్లు తగ్గి పాదాలు మృదువుగా తయార‌వుతాయి. అరటిపండు గుజ్జుకి ఒక టీ స్పూను పాలు, జాజికాయ పొడి, ఓట్ మీల్ కలిపి ముద్దగా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. పూర్తిగా ఎండిపోయిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. కళ్లు పొడిబారే సమస్య ఉంటే రోజుకో అరటి పండు తినండి. అరటి పండు గుజ్జుకి పెరుగు కలిపి ఆ ముద్దని మాడుకి పట్టించి గంట పాటు వదిలేయాలి. తరువాత స్నానం చేయాలి. నెలకోసారి ఇలా చేస్తే జుట్టురాలే సమస్య తగ్గుతుంది.

2. నిమ్మకాయ

విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మ‌కాయ‌లు వయసు ఛాయలు కనిపించకుండా కాపాడుతాయి. వేడినీటిలో ఒక టేబుల్ స్పూన్‌ తేనె, కొంచెం నిమ్మరసం కలిసి రోజూ పరగడుపునే తాగితే చర్మానికి క్లీన్స‌ర్‌గా పనిచేస్తుంది. నలుపుగా ఉన్న చోట నిమ్మ తొక్కలతో తరచూ రుద్దుతూ ఉంటే నలుపు తగ్గుతుంది. నిమ్మకాయ ముక్కపై కాస్త ఉప్పు, బేకింగ్ సోడా చల్లి దాంతో పళ్లు తోముకుంటే తళతళ మెరవడంతో పాటు, నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరిపాలకి నిమ్మరసం కలిపి తలకి పట్టిస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

3. బొప్పాయి

విటమిన్ ఎ, సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి చర్మానికి ఎంతో అవసరమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న పండు ఇది. దీనిలోని పపైన్ అని పిలిచే ఎంజైమ్ మృతకణాల‌ను తొలగించి మెరుపుని తెస్తుంది. బొప్పాయి పండు గుజ్జుకి గుడ్డులోని తెల్లసానను, ఒక టేబుల్ స్పూన్ తేనెని కలిపి ముఖానికి పట్టించాలి. 10 నిముషాల తరవాత మొదట వేడి నీళ్లతో, అనంతరం చన్నీళ్లతో శుభ్రపరచాలి. ఇలా తరచూ చేస్తే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts