మూలిక‌లు

శంఖ‌పుష్పి గురించి తెలుసా..? ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది..!

మ‌న చుట్టూ ప్ర‌కృతిలో అనేక ర‌కాల మొక్క‌లు పెరుగుతుంటాయి. వాటిని స‌రిగ్గా ప‌ట్టించుకోం. కానీ వాటిల్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇప్పుడు చెప్ప‌బోయే మొక్క కూడా స‌రిగ్గా అలాంటిదే. ఈ మొక్క మ‌న ఇంటి చుట్టూ ప‌రిస‌రాల్లో పెరుగుతుంది. దీని పుష్పాలు తెలుపు, నీలి రంగుల్లో ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. అందువ‌ల్ల కొంద‌రు దీన్ని అలంక‌ర‌ణ మొక్క‌గా కూడా పెంచుతుంటారు. కానీ దీంతో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇంత‌కీ ఆ మొక్క ఏమిటో తెలుసా..? అదే.. శంఖ‌పుష్పి.

health benefits of shankha pushpi health benefits of shankha pushpi

శంఖ‌పుష్పి మొక్క మ‌న ఇంటి చుట్టూ ప‌రిస‌రాల్లో పెరుగుతుంది. దీన్ని సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. ఇది ఎక్కువ‌గా నీలి రంగు పువ్వుల‌ను పూస్తుంది. కానీ తెలుపు రంగులో పుష్పించే శంఖ‌పుష్పి మొక్క‌లు కూడా ఉంటాయి. అయితే ఈ మొక్క ద్వారా మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. శంఖ‌పుష్పి మొక్క పువ్వుల‌ను నీటిలో మ‌రిగించి ఆ నీటిని తాగ‌వ‌చ్చు. లేదా పొడి కూడా ల‌భిస్తుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. ఆందోళ‌న‌, ఒత్తిడి త‌గ్గుతాయి.

2. శంఖ‌పుష్పి పువ్వుల నీటిని తాగడం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మంపై ఉండే ముడ‌త‌లు త‌గ్గుతాయి. వృద్ధాప్య ఛాయ‌లు ద‌రిచేర‌వు.

3. శంఖ‌పుష్పి పువ్వుల నీటిని తాగితే విరేచ‌నాలు త‌గ్గుతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జీర్ణాశ‌య గోడ‌లు సుర‌క్షితంగా ఉంటాయి. అల్స‌ర్లు ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది.

4. హైప‌ర్ థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారు శంఖ‌పుష్పి నీటిని రోజూ తాగాలి. దీంతో థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి శంఖ‌పుష్పి ఎంతో మేలు చేస్తుంది.

5. శంఖ‌పుష్పి నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ర‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

6. శంఖ‌పుష్పిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క‌నుక ఆ పువ్వుల నీటిని తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

7. శంఖ‌పుష్పిలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. దీని వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

మార్కెట్‌లో శంఖ‌పుష్పి సిర‌ప్ రూపంలోనూ ల‌భిస్తుంది. దాన్ని ప్యాక్‌పై నిర్దేశించిన విధంగా వాడుకోవాలి. శంఖ‌పుష్పి పౌడ‌ర్ కూడా ల‌భిస్తుంది. దీన్ని గోరు వెచ్చ‌ని నీళ్ల‌లో క‌లిపి తీసుకోవాలి. శంఖ‌పుష్పిని వాడ‌డం వ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ క‌ల‌గ‌వు. కానీ డోసును మాత్రం నిర్దేశించిన విధంగానే వాడుకోవాలి. అవ‌స‌రం అయితే వైద్యుల స‌ల‌హా తీసుకోవాలి. శంఖ‌పుష్పి బీపీని బాగా త‌గ్గిస్తుంది. క‌నుక లో బీపీ ఉన్న‌వారు దీన్ని వాడ‌రాదు. అలాగే గ‌ర్భిణీలు కూడా దీన్ని వాడ‌రాదు.

శంఖ‌పుష్పి పువ్వుల‌ను సేక‌రించి వాటిని నీటిలో మ‌రిగించి ఆ నీటిని ఒక గ్లాస్ మోతాదులో రోజుకు ఒక‌సారి తాగ‌వ‌చ్చు. అవ‌సరం అనుకుంటే అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి తాగ‌వ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin