Wrinkles : వయసు పైబడే కొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజమే. కానీ ప్రస్తుత కాలంలో యుక్త వయసులోనే చర్మంపై ముడతలు వస్తున్నాయి. కారణాలేవైనప్పటికీ చర్మం ముడతలు పడడం వల్ల వయసులో పెద్ద వారి లాగా కనిపిస్తున్నారు. మార్కెట్ లో మనకు వివిధ రకాల యాంటీ ఏజినింగ్ క్రీములు కూడా దొరుకుతున్నాయి. కానీ ఇవి అధిక ధరలతో కూడుకున్నవి. అలాగే వీటిలో రసాయన పదార్థాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంట్లో ఉండే సహజసిద్ధ పదార్థాలతో చాలా తక్కువ ఖర్చులోనే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండానే మనం చర్మంపై వచ్చే ముడతలను తగ్గించుకోవచ్చు.
కేవలం మూడు పదార్థాలను ఉపయోగించి మనం చర్మంపై ముడతలను తొలగించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల చర్మంపై ముడతలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా యవ్వనంగా మారుతుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గాను మనం రెండు టీ స్పూన్ల శనగ పిండిని, ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును, ఒక కివీ పండును ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా కివీ పండును తీసుకుని దానిపై ఉండే తొక్కను తీసి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి మెత్తని గుజ్జుగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలోముందుగా శనగ పిండిని తీసుకోవాలి. తరువాత కలబంద గుజ్జును వేసి కలపాలి. చివరగా కివీ పండు గుజ్జును వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చర్మంపై ముడతలు ఉన్న చోట రాస్తూ 5 నిమిషాల పాటు మర్దనా చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చర్మంపై 45 నిమిషాల నుండి గంట పాటు అలాగే ఉంచిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి 5 రోజుల పాటు పాటించాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల కేవలం 5 రోజుల్లోనే మన చర్మంపై ఉండే ముడతలు తొలగిపోయి చర్మంలో వచ్చే మార్పును మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ చిట్కాను పాటించడం వల్ల మొటిమలు, మచ్చలు అలాగే చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి ముఖం మృదువుగా, కాంతివంతంగా నిగారిస్తుంది. చిన్న వయసులోనే చర్మంపై ముడతలతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల చాలా తక్కువ సమయంలోనే చక్కని ఫలితాన్ని పొందవచ్చు.