చిట్కాలు

Best Remedies To Remove Kidney Stones : కిడ్నీ స్టోన్లను క‌రిగించేందుకు అద్భుత‌మైన ఇంటి చిట్కాలు..!

Best Remedies To Remove Kidney Stones : మ‌న శ‌రీరంలోని అతి ముఖ్య‌మైన అవ‌యవాల్లో కిడ్నీలు కూడా ఒక‌టి. కిడ్నీలు మ‌న శ‌రీర‌లోని వ్య‌ర్థాల‌ను వ‌డ‌బోస్తాయి. ర‌క్తాన్ని శుద్ధి చేస్తాయి. దీంతో శ‌రీరం ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. దీని వల్ల మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల కొంద‌రికి కిడ్నీల‌లో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి. నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌క‌పోవ‌డం వాటిలో ఒక ముఖ్య కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. రోజూ కొంద‌రు త‌గిన మోతాదులో నీళ్ల‌ను తాగ‌రు. దీని వ‌ల్ల శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. అవి కిడ్నీల వ‌ర‌కు ప్ర‌యాణించి అక్క‌డే రాళ్లుగా తయార‌వుతాయి. క‌నుక కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య ఉన్న‌వారు ఆ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ అవొద్దంటే రోజూ త‌గినంత మోతాదులో నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది.

ఇక కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు ప‌లు ఇంటి చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక టీస్పూన్ మెంతుల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి మరుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాలి. దీంతో కిడ్నీల్లోని రాళ్లు క‌రిగిపోతాయి. అలాగే ఒక టీస్పూన్ తుల‌సి ఆకుల ర‌సంలో కాస్త తేనె క‌లిపి ప్ర‌తి రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. ఇలా చేసినా కూడా స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Best Remedies To Remove Kidney Stones

కొత్తిమీర ఆకుల నీళ్ల‌ను తాగాలి..

కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు కొత్తిమీర ఆకుల‌ను వేసి మ‌రిగించిన నీళ్ల‌ను తాగుతుంటే చ‌క్క‌ని ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. కిడ్నీల్లోని రాళ్లు కరిగిపోతాయి. అలాగే అర‌కిలో పెస‌ర ప‌ప్పును లీట‌ర్ నీటిలో కాచిన అనంత‌రం పైన తేరే క‌ట్టును తాగ‌లి. అదేవిధంగా వేపాకుల‌ను కాల్చి బూడిద చేసి ఒక రోజున నిల్వ చేసిన అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని రెండు పూట‌లా నీళ్ల‌లో క‌లిపి తాగుతుండాలి. ఇలా చేస్తున్నా కూడా కిడ్నీల్లోని రాళ్ల‌ను క‌రిగించుకోవ‌చ్చు.

అయితే కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు రోజూ తీసుకునే ఆహారం విష‌యంలోనూ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి. ముఖ్యంగా ఆగ్జ‌లేట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌కూడ‌దు. ట‌మాటా, క్యాబేజీ, పాల‌కూర వంటివి ఈ జాబితాకు చెందుతాయి. క‌నుక కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు కేవ‌లం పైన తెలిపిన చిట్కాల‌ను మాత్ర‌మే కాకుండా స‌రైన ఆహార నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. అప్పుడే స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌తారు.

Admin

Recent Posts