Betel Leaves For Uric Acid : నేటి తరుణంలో మనలో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోవడం, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో బాధపడడం, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం, నీటిని తక్కువగా తాగడం వంటి కారణాల చేత శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువవడం వల్ల గౌట్, కీళ్ల నొప్పులు, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి.
కనుక శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గాలంట ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించి మందులు వాడడం అవసరం. లేదంటే మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. ఇలా మందులు వాడడంతో పాటు తమలపాకును వాడడం వల్ల కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తమలపాకులో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. అలాగే మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి.
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వారు తమలపాకును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకును తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు వెంటనే తగ్గిపోతాయి. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వారు తమలపాకును నమిలి తినవచ్చు. అలాగే రోజూ రాత్రి పడుకునే ముందు తమలపాకును ముక్కలుగా చేసినీటిలో వేయాలి. ఈ నీటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తాగాలి. ఇలా తాగడం వల్ల కూడా సమస్య తగ్గు ముఖం పడుతుంది. లేదంటే ఒక గ్లాస్ నీటిలో తమలపాకును ముక్కలుగా చేసి వేసుకోవాలి.
తరువాత ఈ నీటిని 5 నుండి 8 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తమలపాకు కషాయాన్ని తాగడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. ఈ విధంగా తమలపాకును తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండడంతో పాటు నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడే వారు తమలపాకును ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.