Chicken Legs Fry : మనం చికెన్ తో పాటు చికెన్ లెగ్ పీసెస్ ను కూడా అప్పుడప్పుడూ ఫ్రై చేసుకుని తింటూ ఉంటాము. చికెన్ లెగ్ పీస్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ లెగ్ పీస్ ఫ్రైను ఇష్టంగా తింటూ ఉంటారు. తరచూ ఒకేరకంగా కాకుండా కింద చెప్పిన విధంగా చేసే ఈ లెగ్ పీస్ ఫ్రై కూడా చాలారుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసే లెగ్ పీస్ ఫ్రై పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు, ఎవరైనా దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ లెగ్ పీస్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ లెగ్ పీస్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ లెగ్ పీస్ – 6, పెరుగు – 5 టేబుల్ స్పూన్స్, ఉప్పు – ఒక టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – 2 టేబుల్ స్పూన్స్, కారం – అర టీ స్పూప్, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, టమాట కిచప్ – 4 టీ స్పూన్స్, నిమ్మకాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ.
చికెన్ లెగ్ పీస్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా చికెన్ లెగ్ పీసెస్ కు గాట్లు పెట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ఈ మసాలా మిశ్రమాన్ని చికెన్ లెగ్ పీసెస్ కు బాగా పట్టించి 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తరువాత కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక లెగ్ పీసెస్ తో పాటు మిగిలిన మసాలా పేస్ట్ ను కూడా వేసి వేయించుకోవాలి. వీటిని ముందుగా 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించుకోవాలి.
తరువాత మంటను చిన్నగా చేసి చికెన్ లెగ్ పీసెస్ ను మరో వైపుకు తిప్పుకుని మరో 15 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఈ ముక్కలను మరో వైపుకు తిప్పుకుని మరో 5 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై తయారవుతుంది. వీటిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన చికెన్ లెగ్ పీస్ ఫ్రై ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.