Black Hair Home Remedies : తెల్ల జుట్టును నల్ల‌గా మార్చే అద్భుతమైన చిట్కాలు.. స్వ‌యంగా త‌యారు చేసుకోవ‌చ్చు..

Black Hair Home Remedies : ప్రస్తుత త‌రుణంలో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాగే ఇత‌ర జుట్టు స‌మ‌స్య‌లు కూడా ఉంటున్నాయి. జుట్టు రాలిపోవ‌డం, చిట్లిపోవ‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌ల‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. వంశ పారంప‌ర్యంగా వ‌స్తున్న కార‌ణాలు మాత్ర‌మే కాకుండా ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా థైరాయిడ్‌, హార్మోన్ల లోపం, మాన‌సిక ఒత్తిడి, పోష‌కాహార లోపం వంటివ‌న్నీ జుట్టు స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. అయితే ఎలాంటి జుట్టు స‌మ‌స్య‌లు అయినా స‌రే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా ఉప‌శ‌మనం పొంద‌వ‌చ్చు. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దృఢంగా మారుతుంది. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రినూనెను 250 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. అందులో 10 ఎండు ఉసిరికాయ ముక్క‌ల‌ను వేయాలి. అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని స‌న్న‌ని మంట‌పై వేడి చేయాలి. ముక్క‌లు మెత్తబ‌డి పూర్తిగా నూనెలో క‌లిసిపోతాయి. అప్ప‌టి వ‌ర‌కు మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉండాలి. దీంతో నూనె త‌యార‌వుతుంది. దీన్ని వ‌డ‌క‌ట్టి గాజు సీసాలో నిల్వ చేయాలి. ఈ నూనెను త‌ర‌చూ రాస్తుండ‌డం వ‌ల్ల తెల్లు జుట్టు స‌మ‌స్య త‌గ్గుతుంది. జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాదు.. ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది కూడా.

Black Hair Home Remedies do it yourself at home very easy
Black Hair Home Remedies

ఇక జుట్టు స‌మ‌స్య‌ల‌కు అల్లం కూడా చక్క‌గా ప‌నిచేస్తుంది. ఇందుకు గాను 50 గ్రాముల అల్లం తీసుకుని శుభ్రం చేయాలి. అనంత‌రం అల్లంను తుర‌మాలి. ఇందులో పావు కిలో తేనె వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని గాజు సీసాలో నిల్వ చేయాలి. దీన్ని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డునే తినాలి. ఇలా చేస్తుంటే ఎలాంటి జుట్టు స‌మ‌స్య‌లు అయినా స‌రే త‌గ్గుతాయి, తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.

జుట్టును న‌ల్ల‌గా మార్చేందుకు గోరింట‌, మందార కూడా ఎంత‌గానే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇందుకు గాను 100 గ్రాముల గోరింటాకు, 2 తాజా మందార పువ్వులు (ఒంటి రెక్క‌), 20 గ్రాముల వేపాకు, అర ముక్క క‌ర్పూరం బిళ్ల‌, 250 ఎంఎల్ కొబ్బ‌రినూనెను తీసుకోవాలి. అన్నింటిని క‌లిపి స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి. బాగా మ‌రిగాక చ‌ల్లార్చి వ‌డ‌క‌ట్టాలి. అనంత‌రం వ‌చ్చే నూనెను గాజు సీసాలో నిల్వ చేయాలి. దీన్ని వారంలో రెండు సార్లు వాడాలి. త‌ల‌కు కాస్త నూనె తీసుకుని బాగా ప‌ట్టించాక గంట సేపు ఉండి త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే ఎలాంటి జుట్టు స‌మ‌స్య‌లు అయినా స‌రే త‌గ్గుతాయి. శిరోజాలు న‌ల్ల‌గా మారుతాయి. ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా జుట్టు స‌మ‌స్య‌ల‌కు ప‌లు చిట్కాల‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు.

Editor

Recent Posts