Carom Seeds : ఈ మధ్య కాలంలో చాలా మంది అజీర్తి ఇంకా గ్యాస్ సమస్యలతో బాధ పడుతున్నారు. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ పుడ్స్ లాంటి అనారోగ్యకర ఆహారపు అలవాట్లు సర్వ సాధారణం అయిపోయాయి. కానీ ఇలాంటి ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల జీర్ణాశయానికి సంబంధించిన గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ సమస్యల నుండి త్వరగా బయటపడడానికి కొందరు మెడిసిన్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటి వలన దుష్ప్రభావాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మందులకు బదులుగా మనం ఇంట్లోనే సులువుగా కొన్ని చిట్కాలను ఉపయోగించి అజీర్తి ఇంకా గ్యాస్ ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు.
ఇక ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకు వామును చక్కని పరిష్కారంగా చెబుతున్నారు. అయితే ఈ వాముని ఏవిధంగా వాడితే జీర్ణాశయ ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వాము వలన జీర్ణాశయానికి చాలా లాభాలు ఉన్నాయి. ఇది అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ మొదలైన సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియలో ఇబ్బందులను తొలగించి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే అజీర్తి వలన కలిగే కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
వామును నిమ్మరసంతో కలిపి తీసుకున్నప్పుడు జీర్ణాశయంలో హైడ్రో క్లోరిక్ యాసిడ్ పునరుద్ధరించబడి ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా ప్రొటీన్ ఆహారం అరుగుదలకు ఈ హైడ్రో క్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి చాలా అవసరం. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరం అనేది తగ్గుతుంది. దీనికోసం కొద్దిగా వాము తీసుకొని దానికి నిమ్మరసంతో పాటు చిటికెడు నల్ల ఉప్పును కలిపి రోజుకు 2 సార్లు సేవించాలి. దీని వలన మంచి ఫలితాలు పొందవచ్చు.
అలాగే వాము ఇంకా అల్లం పొడి మిశ్రమాన్ని కూడా తీసుకోవచ్చు. వీటిలో ఉండే యాక్టివ్ ఎంజైమ్స్ జీర్ణరసాలను మెరుగు పరుస్తాయి. దీని వలన అజీర్తి, గ్యాస్ సమస్యలు దూరం అవుతాయి. ఇందుకోసం ముందుగా వాము ఇంకా ఎండబెట్టిన అల్లంను కలిపి పొడి చేసుకోవాలి. ఈ పొడిని 1 టీ స్పూన్ తీసుకొని దానికి కొద్దిగా నీళ్లు ఇంకా చిటికెడు నల్ల ఉప్పును కలిపి తాగాలి.
అంతే కాకుండా వామును కషాయంలా కూడా చేసుకొని తాగవచ్చు. దీని కోసం కొన్ని నీళ్లలో వాము గింజలతోపాటు కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. ఇలా కాసేపు మరిగించిన తరువాత చల్లార్చి వడబోసుకోవాలి. ఈ నీటిని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి.
అలాగే కొద్దిగా వాము ఇంకా చిటికెడు ఇంగువను కలిపి నమిలి మింగుతూ ఉండాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లను కూడా తాగవచ్చు. దీని వలన జీర్ణశయానికి సంబంధించిన వివిధ రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ విధంగా వామును తరచూ మన ఆహారంలో భాగం చేసుకోవడం వలన కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ లాంటి సమస్యలు మన దరి చేరవు.