Grape Juice : మారుతున్న జీవన విధానం వల్ల సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న స్త్రీల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. సంతాన లేమి సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, సరైన వయస్సులో వివాహం చేసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, ఎలక్ట్రానిక్ పరికరాలను అధికంగా వాడడం వంటి కారణాల వల్ల స్త్రీలలో సంతాన లేమి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం స్త్రీలలోనే కాకుండా పురుషుల్లో కూడా మనం ఈ సమస్యలను చూడవచ్చు.
మద్యపానం, ధూమపానం వంటి వాటిని కూడా మనం పురుషుల్లో సంతానలేమికి కారణాలుగా చెప్పవచ్చు. సంతానం కోసం దంపతులు ఎన్నో ఆధునిక పద్ధతులను కూడా పాటిస్తున్నారు. ఇటువంటి పద్ధతులను పాటించడాని కంటే ముందు మన జీవన శైలిలో అలాగే ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావడం వల్ల కూడా మనం ఈ సమస్య నుండి బయట పడవచ్చు. కంటి నిండా నిద్రపోవడం, వీలైనంత ఎక్కువగా ద్రాక్ష పండ్లను తినడం వల్ల సంతానం కలిగే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. నెలసరి సమయంలో విపరీతమైన కడుపు నొప్పి, నెలసరి సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు నల్ల ద్రాక్షలను తినడం లేదా వాటి రసాన్ని తాగడం వంటివి తరచూ చేయాలి.
ద్రాక్ష రసంలో ఐరన్, కాపర్, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ద్రాక్ష పండ్లను తినడం లేదా వాటి రసాన్ని తాగడం వంటివి చేయడం వల్ల సంతాన లేమి సమస్యలతోపాటు ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడకుండా ఉంటాం. ద్రాక్ష రసంతోపాటు యాలకులు, దాల్చిన చెక్క, శొంఠి పొడి, తేనెను ఉపయోగించి చేసిన మిశ్రమాన్ని దంపతులు ఇరువురు ప్రతిరోజూ తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్యలు తగ్గి సంతానం కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష పండ్లతోపాటు పల్లీలు, బ్లూబెర్రీలను తినడం ద్వారా కూడా సంతాన లేమి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈవిధంగా నల్ల ద్రాక్షలను తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్యలు తగ్గి సంతానం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.