చిట్కాలు

మెరిసే చర్మం కోసం.. కొబ్బరి పాలు, నిమ్మరసం..!

సాధారణంగా చాలా మంది చర్మకాంతి పొందాలని భావిస్తారు. ఈ క్రమంలోనే ఎంతో ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ విధంగా మార్కెట్లో రసాయనాలతో తయారైన ఉత్పత్తులను చర్మానికి అలర్జీలను తీసుకువస్తాయి.ఈ క్రమంలోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం కొన్ని చిట్కాలతో ఇరవై నిమిషాలలో మన చర్మాన్ని ఎంతో కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన చర్మాన్ని చర్మకాంతిని పొందాలనుకునేవారు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్టులా తయారుచేసి ముఖంపై మర్దనా చేయాలి.20 నిమిషాల పాటు అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే ఎంతో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.ఈ విధంగా చర్మం కాంతిని మెరుగు పరచడం కాకుండా ముఖం పై ఉన్న మచ్చలు వలయాలు తొలగిపోతాయి. అదేవిధంగా ముఖం పై ఏర్పడిన ముడతలను కూడా తొలగిస్తుంది.

coconut milk and lemon juice for beauty coconut milk and lemon juice for beauty

అదేవిధంగా టేబుల్స్ వన్ ముల్తాన్ మట్టి, ఒక టేబుల్ స్పూన్ తేనే, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారుచేసుకుని మొహానికి, మెడకు ప్యాక్ వేసుకోవాలి. సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగా వారంలో కనీసం రెండు మూడు సార్లు చేయడం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.

Admin

Recent Posts