Cough Cold : దగ్గు, జలుబును కేవలం ఒకే రోజులో తగ్గించుకోండిలా.. దీన్ని తీసుకోండి..!

Cough Cold : ప్రస్తుతం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది దగ్గు, జలుబు సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి బయట పడాలంటే.. అందుకు ఇంగ్లిష్‌ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Cough Cold can reduced in one day with this remedy take this

ఈ సీజన్‌లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. బాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. ఛాతిలో కఫం ఎక్కువగా చేరుతుంది. దగ్గు, జలుబు, జ్వరం ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అయితే వీటిని కేవలం ఒకే రోజులో చాలా వరకు తగ్గించుకోవచ్చు. అందుకు గాను పది తులసి ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి పేస్ట్‌లా చేసి వాటి నుంచి రసం తీయాలి.

తులసి ఆకుల రసాన్ని రెండు టీస్పూన్ల మోతాదులో తీసుకుని అందులో నాలుగు లేదా ఐదు మిరియాలు పొడి చేసి కలపాలి. అనంతరం అందులో ఒక టీస్పూన్‌ తేనె వేసి మళ్లీ బాగా కలపాలి. దీన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మూడింటిలో ఉండే ఔషధ గుణాలు కేవలం ఒకే రోజులో దగ్గు, జలుబులను తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వైరస్‌ ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తాయి. ఎవరైనా దగ్గు, జలుబుతో బాధపడుతుంటే ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవచ్చు. ఒక్కో విడతకు ఒక టీస్పూన్‌ చొప్పున తీసుకోవాలి. అదే చిన్నారులు అయితే అందులో సగం మోతాదులో ఇవ్వాలి.

ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి దగ్గు, జలుబు అయినా సరే ఒక్క రోజులోనే తగ్గిపోతుంది. అలాగే జీర్ణాశయంలో ఉండే పురుగులు నశిస్తాయి. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఛాతిలో ఉండే కఫం మొత్తం పోతుంది. శరీరంలో వెచ్చదనం పెరుగుతుంది. చలి నుంచి రక్షణ లభిస్తుంది.

ఈ మిశ్రమం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Admin

Recent Posts