Tomatoes : మనకు అత్యంత చవకగా అందుబాటులో ఉండే కూరగాయల్లో టమాటాలు ఒకటి. వీటిని నిత్యం చాలా మంది ఉపయోగిస్తుంటారు. టమాటాలతో పప్పు, చారు, కూర వంటి అనేక రకాల వంటలను నిత్యం చేసుకుంటుంటారు. అయితే రోజుకో యాపిల్‌ను తినడం వల్ల డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదనే మాట ఎంత సత్యమో.. అది టమాటాలకు కూడా వర్తిస్తుంది. ఈ క్రమంలోనే రోజుకు ఒక టమాటాను తినడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రస్తుతం కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీని ప్రభావం చర్మం, వెంట్రుకలపై పడుతోంది. దీని వల్ల చర్మం దెబ్బ తినడమే కాక, శిరోజాలు కూడా రాలిపోతున్నాయి. చాలా మందికి చర్మం, వెంట్రుకల సమస్యలు వస్తున్నాయి. అయితే రోజుకు ఒక టమాటాను తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. అలాగే శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ చర్మం, శిరోజాలను సంరక్షిస్తాయి.
2. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను పెరగనీయదు. దీంతో ప్రోస్టేట్, జీర్ణాశయం, పెద్దపేగు క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
3. టమాటాల్లో విటమిన్ కె, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తింటే ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
4. టమాటాల్లో కౌమారిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి సిగరెట్ స్మోకింగ్ వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. దీంతో క్యాన్సర్ రాకుండా చూస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
5. టమాటాల్లో విటమిన్ ఎ, సిలు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను బయటకు పంపిస్తాయి. దీంతో విటమిన్ సి ని శరీరం ఎక్కువగా శోషించుకుంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులను రాకుండా చూస్తుంది. ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
6. టమాటాల్లో ఉండే విటమిన్ ఎ, బి విటమిన్లు, పొటాషియం కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల గుండె జబ్బులు.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
7. టమాటాల్లో క్రోమియం అనే మినరల్ అధికంగా ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజూ టమాటాలను తినడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
8. టమాటాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ ఆరోగ్యంగా పనిచేస్తుంది. టమాటాల్లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
9. టమాటాల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతోపాటు ఒత్తిడిని కలిగించే హార్మోన్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది.
10. అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్నవారు రోజూ టమాటాలను తినాలి. దీని వల్ల వాటిల్లో ఉండే కార్నిటైన్ అనే సమ్మేళనం కొవ్వును కరిగిస్తుంది. దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు.
టమాటాలను రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఒకటి లేదా రెండు అలాగే నేరుగా తినవచ్చు. లేదా కొద్దిగా ఉడకబెట్టి తినవచ్చు. లేదా ఒక కప్పు సూప్ రూపంలోనూ తీసుకోవచ్చు.