చిట్కాలు

Teeth Pain : చిన్న ఉల్లిపాయ ముక్క చాలు.. పంటి నొప్పి త‌గ్గిపోతుంది..!

Teeth Pain : పంటి నొప్పి చాలా మందికి అప్పుడప్పుడూ కలుగుతూ ఉంటుంది. మనం దంతాల ఆరోగ్యంపై కూడా కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. దంతాలు ఆరోగ్యంగా లేకపోతే అనవసరంగా లేనిపోని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. డెంటిస్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కచ్చితంగా ప్రతిరోజు పంటి శుభ్రతపై దృష్టి పెట్టండి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు పళ్ళని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. పళ్ళని సరిగా క్లీన్ చేసుకోకపోతే వివిధ రకాల సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది.

అయితే పంటి నొప్పితో బాధపడేవాళ్లు పంటి నొప్పి నుండి బయట పడడానికి ఇలా చేయ‌వ‌చ్చు. ఇలా సులభంగా పంటి నొప్పి నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ఆరోగ్యానికి ఉల్లి ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయలతో పంటి నొప్పి క్షణాల్లో దూరమవుతుంది. పంటి నొప్పిని ఈజీగా పోగొట్టి దంతాలకి మెరుపుని కూడా ఇస్తుంది. దంతాల సంరక్షణకి ఉల్లి ఉత్తమమైన మార్గమని చెప్ప‌వ‌చ్చు. మీరు ఉల్లిపాయల్ని పంటి దగ్గర పెట్టుకుంటే సమస్య తగ్గుతుంది.

do like this with onions to get away from teeth pain

అదే విధంగా బంగాళాదుంపల్ని తురుముకుని రసం తీసుకోవాలి. ఈ రసాన్ని పంటి దగ్గర రాయడం వలన ఉపశమనం లభిస్తుంది. కీరదోస కూడా పంటి నొప్పిని తగ్గిస్తుంది. దోసకాయ రసాన్ని కొంచెం దూదిలో ముంచి, కొంచెం ఆల్కహాల్ మిక్స్ చేసి దంతాల కింద పెట్టండి. వెంటనే పంటి నొప్పి తగ్గుతుంది. జలుబు, తలనొప్పి వచ్చినప్పుడు మనం విక్స్ రాసుకుంటాం కదా పంటి నొప్పికి విక్స్ కూడా పనిచేస్తుంది.

కొంచెం విక్స్ ని తీసుకుని చెంపల బ‌య‌టి భాగంలో రాయండి. పంటి నొప్పి కొంచెం సేపట్లోనే తగ్గిపోతుంది. లవంగాల నూనెని పంటి దగ్గర పెట్టడం వలన కూడా వెంటనే ఉపశమనం లభిస్తుంది. పెప్ప‌ర్‌మింట్‌ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది. అల్లం, పసుపు ముద్ద, ఆవిరి పట్టడం లేదంటే ఆయిల్ పుల్లింగ్ కూడా పంటి నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.

Admin

Recent Posts