దీన్ని తాగితే.. పొట్ట‌లోని గ్యాస్‌, అసిడిటీ.. క్ష‌ణాల్లో మాయం..!

ప్ర‌స్తుత త‌రుణంలో గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి, ఎసిడిటీ వంటి జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. ఈ స‌మ‌స్య‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. పీచు ప‌దార్థాలు త‌క్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం, నీటిని ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్, మాంసాహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవ‌డం, స‌మ‌యానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, మారిన జీవ‌న విధానం వంటి త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌నం ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం.

ఈ జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మ‌నం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఉండ‌దు. మార్కెట్ లో దొరికే వివిధ ర‌కాల సిర‌ప్ ల‌ను, పొడుల‌ను నీటిలో క‌లుపుకుని తాగ‌డం, ట్యాబ్లెట్ ల‌ను తీసుకోవ‌డం వంటి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాల‌ను చేస్తూ ఉంటాం. వీటి వ‌ల్ల తాత్కాలిక ఫ‌లితం మాత్ర‌మే ఉంటుంది. అంతేకాకుండా మ‌నం వీటిని వాడ‌డం వల్ల దుష్ప్ర‌భావాల‌ను కూడా ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంది. స‌హ‌జసిద్ధంగా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండానే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటి నుండి మ‌నం ఎలా బ‌య‌ట‌ప‌డాలో ఇప్పుడు తెలుసుకుందాం.

drink this tea for gas and acidity problems

మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న ఈ జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల‌న్నింటినీ న‌యం చేయ‌డంలో మ‌న‌కు సోంపు గింజ‌లు ఎంత‌గానో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. సోంపు గింజ‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. సోంపు గింజ‌ల‌తో టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌ల‌న్నింటి నుండి మ‌నం ఉప‌శ‌మ‌నాన్ని పొంవ‌చ్చు. సోంపు గింజ‌ల‌తో టీ ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి త‌రువాత ఒక టీ స్పూన్ సోంపు గింజ‌ల‌ను వేయాలి. ఈ నీటిని 10 నిమిషాల పాటు బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టాలి. ఇలా వ‌డ‌క‌ట్టిన నీటినే సోంపు గింజ‌ల టీ అంటారు. ఈ టీ ని గోరు వెచ్చ‌గా తాగ‌డం వ‌ల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నవారు ఈ టీ లో ఒక టీ స్పూన్ ఆముదాన్ని క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

ఈ సోంపు గింజ‌ల టీ ని తాగ‌డం వ‌ల్ల స్త్రీల‌లో వ‌చ్చే రుతుసంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. బాలింత‌లు ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల వారిలో పాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. పురుషులు ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల వీర్య క‌ణాల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ప్ర‌తిరోజూ ఈ సోంపు గింజ‌ల టీ ని తాగ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో ఉండే మ‌లినాలు తొలిగిపోయి జీర్ణాశ‌యం శుభ్ర‌ప‌డుతుంది.

అంతేకాకుండా సోంపు గింజ‌ల టీ ని తాగడం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. శ‌రీరంలో ఉండే మ‌లినాలు కూడా తొల‌గిపోతాయి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు, మూత్ర పిండాల స‌మ‌స్య‌లు ఉన్న వారు ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ విధంగా సోంపు గింజ‌ల టీని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని, దీనిని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts