White Teeth : దంతాలు అనేవి తెల్లగా మిలమిల మెరవాలనే చాలా మంది కోరుకుంటారు. రంగు మారిపోయి పసుపు పచ్చగా కనిపించాలని ఎవరూ కోరుకోరు. కానీ కొందరి దంతాలు భిన్నమైన రంగులో కనిపిస్తుంటాయి. అందుకు అనేక కారణాలు ఉంటాయి. కొందరు దంతాలను ఎంత శుభ్రం చేసుకున్నా తెల్లగా కనిపించడం లేదని ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. దీంతో దంతాలు తెల్లగా మారి మిలమిల మెరుస్తాయి. మరి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే..
1. అరటి పండ్లను తినగానే వాటి తొక్కలను చాలా మంది పడేస్తుంటారు. వాస్తవానికి ఆ తొక్కలను పడేయరాదు. వాటితో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అరటి పండు తొక్కలతో దంతాలపై రుద్దడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. కనుక ఈసారి అరటి పండ్లను తిన్నప్పుడు తొక్కలను పడేయకండి. వాటిని ఉపయోగించి దంతాలను శుభ్రం చేయండి. ఇలా తరచూ చేస్తుంటే దంతాలు తెల్లగా మారుతాయి. పసుపు దనం పోతుంది. అలాగే నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి.
2. అరటి పండు తొక్కల్లాగే నారింజ పండు తొక్కలు కూడా పనిచేస్తాయి. వాటితోనూ దంతాలను తోముకోవచ్చు. వాటి లోపలి భాగం ఉపయోగించి దంతాలను తోముకోవడం వల్ల దంతాలు తెల్లగా మారి మిలమిలా మెరుస్తాయి. దీంతోపాటు నోటి సమస్యలు తగ్గిపోతాయి.
3. రోజూ వేప పుల్లలను ఉపయోగించి దంతాలను తోముకోవడం అలవాటు చేసుకోవాలి. దీంతోనూ దంతాలు తెల్లగా మారుతాయి. అలాగే నోటి దుర్వాసన తగ్గి, దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. దంతాలపై ఉండే గార కూడా పోతుంది. వేపపుల్లలు లభించకపోతే వేపాకులను తీసుకుని నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. దాన్ని సీసాలో నిల్వ చేసుకుని రోజూ కొద్దిగా ఉపయోగించుకోవచ్చు. దీంతో దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. తెల్లగా మారుతాయి.
4. రోజూ 10 నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల కూడా దంతాలు, నోటి సమస్యలు తగ్గుతాయి. దంతాలు తెల్లగా మారుతాయి. ఆయిల్ పుల్లింగ్‌కు గాను నువ్వుల నూనె లేదా కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. నోట్లో ఆ నూనెను పోసుకుని 10 నిమిషాల పాటు నూనెను నోరు మొత్తం కలియదిప్పుతూ ఉండాలి. ఇలా ఆయిల్ పుల్లింగ్ చేయాలి. దీని వల్ల దంతాలు, నోరు ఆరోగ్యంగా ఉంటాయి.
5. రోజుకు రెండు సార్లు దంతాలను తోముకోవడం వల్ల కూడా దంతాలు తెల్లగా మారుతాయి. కొందరు కేవలం ఒక్కసారి మాత్రమే దంతాలను తోముకుంటారు. కానీ రోజుకు రెండు సార్లు దంతాలను తోముకోవడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు తెల్లగా మారుతాయి.