వేసవి వచ్చిందంటే వడదెబ్బ సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. ఈ వడదెబ్బకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సమస్య మాయమవుతుంది. అవేంటో ఒకసారి చూద్దాం. నీరుల్లిపాయల రసాన్ని కణతలకు, గుండెకు రాసినట్లయితే వడదెబ్బ తగ్గుతుంది. పండిన చింతకాయలను నీటిలో పిసికి ఆ రసంలో ఉప్పు కలిపి త్రాగించవలెను.
చల్లటి మంచినీటిలో నిమ్మరసం, ఉప్పు కలిపి మాటిమాటికీ త్రాగిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు. మేకపాలు తీసుకుని వడదెబ్బ తగిలినవారికి అరచేతులకు పాదాలకు మర్దనా చేస్తే ఉపశమనం కలుగుతుంది.
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే బయటకు వెళ్లేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లను తగినన్ని తాగాల్సి ఉంటుంది. తలకు ఎండ తగలకుండా క్యాప్ లాంటివి ధరించాలి. మహిళలు అయితే స్కార్ఫ్ కట్టుకోవచ్చు. వీలున్నంత వరకు ఉదయం లేదా సాయంత్రం పనులను పూర్తి చేయాలి. మధ్యాహ్నం బయటకు వెళ్లకూడదు. అత్యవసరం అయి వెళ్లాల్సి వస్తే కచ్చితంగా నీళ్లను తాగాలి. దాహం అవుతుంటే కొబ్బరి నీళ్లను తాగాలి. ఇలా జాగ్రత్తలు పాటిస్తే ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది.