Dandruff : మనల్ని వేధించే జుట్టు సంబంధిత సమస్యల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. ఎన్ని రకాల షాంపులను వాడినప్పటికీ ఈ చుండ్రు సమస్య నుండి బయటపడలేక పోతుంటారు. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తుంటుంది. ఈ సమస్య బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. పొడి చర్మాన్ని కలిగి ఉండడం వల్ల, తలను తరచూ శుభ్రం చేసుకోకపోవడం వల్ల, సరైన పోషకాహారాన్ని తీసుకోకపోవడం వల్ల, ఎక్కువగా తలను శుభ్రం చేయడం వల్ల, మానసిక ఒత్తిడి కారణంగా ఈ చుండ్రు సమస్య వస్తుందని నిపుణలు చెబుతున్నారు.
కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల ఈ చుండ్రు సమస్య నుండి మనం చాలా త్వరగా బయటపడవచ్చు. చుండ్రును తొలగించడంలో నిమ్మకాయ మనకు ఎంతో సహాయపడుతుంది. నిమ్మ రసాన్ని తలకు బాగా పట్టించి అర గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చుండ్రు సమస్య రాకుండా ఉంటుంది. అలాగే కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.
కొబ్బరి నూనెలో నిమ్మ రసాన్ని కలిపి తలకు పట్టించి కొద్ది సమయం తరువాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య దూరం అవుతుంది. తలకు పెరుగును పట్టించి ఒక గంట తరువాత తలస్నానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే తలకు కోడిగుడ్డు పచ్చసొనను రాసి కొంత సమయం తరువాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య నివారించబడుతుంది.
కలబంద గుజ్జును తలకు రాసి అరగంట తరువాత కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల చుండ్రు పోతుంది. నీటిలో వేప ఆకులను వేసి వేడి చేసి ఆ నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఆముదంతో తరచూ తలకు మర్దనా చేసుకోవడం వల్ల చుండ్రు సమస్య మన దరిచేరకుండా ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తూనే వారానికి కనీసం రెండు సార్లు తలస్నానం చేయాలి. ఈ విధంగా తరచూ చేయడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోవడంతోపాటు మరలా ఆ సమస్య రాకుండా ఉంటుంది.