చిట్కాలు

ప్రయాణాలలో వాంతులవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..

చాలామందికి బస్ ప్రయాణం పడదు..బస్ లో ప్రయాణం చేసేప్పుడు వికారంగా,కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది..దాని ఫలితంగా వామిటింగ్ కూడా అవుతుంది… ఎక్కువగా తిరుమలకు లేదంటే ఏదన్నా ఘాట్ రోడ్స్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.ఇలా చాలామందికి వాహన ప్రయాణాల సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటివారు ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యనుండి బయటపడవచ్చు..

చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది.అల్లంలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు. వక్కపొడి లాంటిది చప్పరిస్తున్న కూడా ఈ ఫీలింగ్ నుండి బయటపడొచ్చు.

follow these remedies to prevent motion sickness

నిమ్మకాయను ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీలుస్తుంటే కూడా ఈ సమస్య ను తగ్గించుకోవచ్చు… లవంగాలు,సోంపు లాంటివి కూడా దవడకు పెట్టుకుని చప్పరిస్తున్న కూడా వాంటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది.. మరీ ముఖ్యంగా బస్ లో కానీ ,కార్లో కానీ ప్రయాణించేప్పుడు ముందు సీట్లో కూర్చుని మన దృష్టి కూడా స్ట్రెయిట్ గా చూసినట్టయితే వామిటింగ్ సెన్సేషన్ నుండి తప్పించుకోవచ్చు…

Admin

Recent Posts