చిట్కాలు

మ‌జ్జిగ‌తో ఇలా చేస్తే విరేచ‌నాలు త‌గ్గిపోతాయి..!

మజ్జిగలో కాస్త అల్లం పొడిని, ఉప్పుని కలిపి తీసుకుంటే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి. మజ్జిగలో కొంచెం పసుపు, కాస్త ఉప్పు కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి. మల్బరీ ఆకుని వేడిచేసి వాసన పీలిస్తే దగ్గు తగ్గుతుంది. మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు నువ్వులనూనెతో కాని నెయ్యితో కాని తలకు నుదుటిమీద మర్ధన చేయాలి. రాత్రిపూట మర్ధన చేసి, ఉదయాన్నే తలస్నానం చేయాలి. మామిడి గింజల పొడిని నీటిలో కలిపి తాగితే డయేరియా తగ్గుతుంది. మిరియాలతో దగ్గు, జలుబు, గొంతు నొప్పుల నుంచి ఉపశమనం ఇచ్చే మందుని తయారు చేసుకోవచ్చు.

ఒక గ్లాసు మంచినీరు, ఐదు లేక ఆరు మిరియాలు, ఒక ముక్క తెల్ల ఉల్లిపాయ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం ముక్క ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానె తాగండి. దీనిని సేవించడం వల్ల పైన చెప్పిన చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మూడు టీ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, రెండు టీ స్పూన్ల యూకలిప్టస్‌ ఆయిల్‌ను షాంపూలో కలుపుకొని తలస్నానం చేస్తే పేలు పోతాయి.

follow these wonderful remedies for diarrhoea

మొటిమలు కాని ఒంటిమీద మరెక్కడైనా ఇన్‌ఫెక్షన్ కాని ఉన్నట్లయితే ఒక గుప్పెడు లేత వేపాకులలో చిటికెడు పసుపు కలిపి గ్రైండ్ చేసి సమస్య ఉన్నచోట రాయాలి. కనీసం వారానికి ఒకసారయినా ఇదే మిశ్రమాన్ని ఐదు గ్రాముల చొప్పున కడుపులోకి తీసుకుంటే జీర్ణవ్యవస్ధలో ఇన్‌ఫెక్షన్‌ను అరికడుతుంది. మిరియాలు మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే వీటిని మసాజ్ ఆయిల్ తయారీలో ఒక పదార్థంగా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్‌తో మర్థనా చేసుకోవడం లేదా కొన్ని చుక్కలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కండరాల నొప్పులు, మామూలు నొప్పులు, గాయాలనుండి రసికారడాన్ని అరికట్టడంలో ఎంతో ప్రతిభావంతంగా పని చేస్తుంది.

Admin

Recent Posts