చిట్కాలు

ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌ల‌ను త‌గ్గించే సింపుల్ చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది రకరకాల చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు&period; నిజానికి ముఖం మీద కానీ చర్మంపై కానీ ఏమైనా మచ్చలు మొటిమలు వంటివి వచ్చాయంటే అందం పాడవుతుంది&period; ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఇటువంటివి అందాన్ని తగ్గిస్తూ ఉంటాయి&period; చాలామంది మొటిమలు మచ్చలు వచ్చాయి అంటే క్రీములని వాడడం లేజర్ ట్రీట్మెంట్లను చేయించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు&period; అలా కాకుండా మొటిమలు&comma; మొటిమల కారణంగా వచ్చే మచ్చలు లేదంటే ఇంకేమైనా చర్మంపై ఇబ్బందిని కలిగిస్తుంటే ఈ విధంగా మీరు పోగొట్టుకోవచ్చు&period; క్లియర్ స్కిన్ ని పొందొచ్చు&period; మరి అది ఎలా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీర&comma; బార్లీ మీ అందాన్ని పెంచుతాయి&period; నల్లటి మచ్చల్ని తొలగిస్తాయి&period; ఒక టీ స్పూన్ కీరా దోస పేస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ బార్లీ పిండిని వేయండి&period; దీనిని పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేయండి&period; 15 నుండి 20 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోండి&period; ఇలా చేస్తే నల్లటి మచ్చలు పోతాయి ఓట్స్ బార్లీ పౌడర్ కూడా బాగా హెల్ప్ అవుతాయి&period; మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు తొలగించడానికి ఓట్స్ పౌడర్ బార్లీ పౌడర్ ముఖానికి అప్లై చేసుకోవడం మంచిది ఈ రెండిటిని ముందు పేస్ట్ లాగ చేసుకుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88716 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;acne&period;jpg" alt&equals;"follow these wonderful tips to reduce acne and dark spots " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొటిమలు నల్లని మచ్చలు ఏర్పడినట్లయితే బాదం పప్పులని కొన్ని పాలల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తటి పేస్ట్ లాగా చేసి కొంచెం సెనగపిండి కొంచెం నిమ్మరసం వేసి పేస్ట్ లాగ చేసుకుని ముఖానికి పట్టిస్తే సరిపోతుంది&period; ఆరిన తర్వాత కడిగేసుకోండి&period; బంగాళదుంపల్ని మెత్తని పేస్ట్ చేసి రసం తీసుకోవాలి&period; ఈ రసం లో కొంచెం&comma; తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలా వదిలేసి ఆరాక ముఖం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది&period; ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో మీ అందాన్ని మరింత పెంచుకోవచ్చు&period; మొటిమలు&comma; మచ్చలు వంటివి లేకుండా అందంగా కనపడొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts