చిట్కాలు

Heel Pain : మ‌డ‌మ‌ల నొప్పి ఇబ్బందుల‌కు గురి చేస్తుందా.. ఇలా చేస్తే నొప్పి పూర్తిగా త‌గ్గుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Heel Pain &colon; ప్రస్తుతకాలంలో మడమల‌ నొప్పి సాధారణంగా ఎదుర్కొనే సమస్యలలో ఒకటిగా చెప్పవచ్చు&period; మారుతున్న జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మడమ నొప్పితో బాధపడుతున్నారు&period; అధిక బరువు&comma; సరైన పోషకాహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో మడమల‌ నొప్పి సమస్య ఎదురవుతుంది&period; మనిషి ప్రతి కదలిక మడమలోని కీలు సహాయంతో జరుగుతుంది&period; మడమ ఎముకలో మార్పు రావటంవలన మడ‌à°® నొప్పితో కదలికలు అనేవి కష్టంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం సమయంలో మంచంపై నుంచి కాలు కింద పెట్టగానే అడుగు తీసి అడుగు వేయలేనంత విపరీతమైన నొప్పితో ఇబ్బంది పడవలసి వస్తుంది&period; దీని కోసం మందులు వాడడం కన్నా ఇంటి చిట్కాలు ఎంతగానో సహకరిస్తాయి&period; ఇందు కోసం కేవలం గోరింటాకు&comma; ఆముదం ఉంటే చాలు&period; గోరింటాకు ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి&period; ఈ గోరింటాకు ఆకులను ఆముదంలో వేసి బాగా వేయించాలి&period; ఈ నూనెను వడకట్టి మడమ నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేసుకోవాలి&period; ఆ తరువాత వేయించిన గోరింటాకును మడమ నొప్పి ఉన్న చోట ఎంత వేడి అయితే పట్టగలరో పట్టులా వేసి గట్టిగా కట్టు కట్టాలి&period; ఈ విధంగా రెండు&comma; మూడు రోజుల పాటు చేస్తే మడమ నొప్పి తగ్గుముఖం పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61079 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;heel-pain&period;jpg" alt&equals;"follow this remedy to get rid of ankle pain " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మడమలో నొప్పి ఎక్కువగా బాధ పెడుతున్నప్పుడు పది నిమిషాలసేపు ఐస్ ముక్కతో పాదానికి కాపడం పెట్టాలి&period; ప్రతి రోజూ కొంత సమయం నడవడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి మడమల‌ నొప్పి అనేది తగ్గుతుంది&period; అదేవిధంగా మడమల‌ నొప్పి తగ్గడానికి మరో చిట్కా కూడా మనకు ఎంతగానో సహకరిస్తుంది&period; యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మడమ నొప్పి తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది&period; బకెట్ గోరువెచ్చని నీటిలో మూడు లేదా నాలుగు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి మన పాదాల‌ను 15 నిమిషాల పాటు ఉంచడం ద్వారా మడమల‌ నొప్పి అనేది మటుమాయమవుతుంది&period; ఇలా రోజూ చేస్తే నొప్పి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌వచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts