చిట్కాలు

ఈ చిట్కాను పాటిస్తే చాలు.. మీ జుట్టు రాల‌డం పూర్తిగా త‌గ్గిపోతుంది..

పొడవు జుట్టు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. పొడుగు జడ ఉన్న అమ్మాయిలు ఎంతమందిలో ఉన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లా ఉంటారు. ఇక జుట్టు పొడవుగా ఉన్న అమ్మాయిలనే అబ్బాయిలు కూడా ఎక్కువగా ఇష్టపడతారట. ఈ రోజుల్లో జుట్టు పొడుగ్గా పెంచుకోవడం పెద్ద సమస్యలా మారిపోయింది. పెరుగుతున్న పొల్యూషన్ జుట్టుకు ప్రధాన సమస్యల్లా మారిపోయాయి.

ఇలాంటి సమస్యల్ని తట్టుకొని జుట్టు పొడుగ్గా, దృడంగా పెరగడానికి మన పూర్వీకులు వాడిన ఒక ఇంటి చిట్కా ఉంది. ఇప్పుడు ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం.

follow this wnderful home remedy to reduce hair fall

ముందుగా సన్నని మర్రి ఊడలు, గుంటగలగరాకును తెచ్చుకుని శుభ్రం చేసుకుని పెట్టుకోండి. ఈ రెండిటిని సమభాగాలుగా కలిపి మెత్తగా నూరండి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమం ఒక కప్పు తీసుకుంటే దానికి మూడు కప్పుల నువ్వుల నూనెను కలిపి ఓ మందపాటి కడాయిలో పోసి సన్నని సెగపై ఒక 10-15 నిమిషాలు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ నూనె గోరువెచ్చగా అయ్యాక దానిని వడకట్టి గాజు సీసాలో నిల్వ ఉంచండి. రోజూ ఈ నూనెను తలకు రాస్తూ ఉంటే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

Admin

Recent Posts