Guava Leaves : ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో దంతాల సమస్య కూడా ఒకటి. పంటి నొప్పితో, పిప్పి పళ్లతో బాధపడుతున్న వారు రోజురోజుకీ ఎక్కువవుతున్నారు. పంటి నొప్పి నుండి బయటపడడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆయుర్వేదం ద్వారా మనం చాలా సులువుగా పంటి నొప్పి నుండి పిప్పి పళ్ల వల్ల కలిగే నొప్పి నుండి బయట పడవచ్చు. ఒక చిన్న చిట్కాను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.
కేవలం జామ చెట్టు ఆకులను ఉపయోగించి మనం పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు. జామ చెట్టు ఆకులను ఉపయోగించి పంటి నొప్పిని ఎలా తగ్గిచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం 5 లేదా 6 జామ చెట్టు ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి అందులో శుభ్రంగా కడిగి ఉంచిన జామ ఆకులను వేసి ఒక గ్లాసు నీళ్లు అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఇలా వడకట్టిన నీరు చల్లగా అయ్యే వరకు ఉంచి అందులో రాళ్ల ఉప్పును వేసి ఉప్పు కరిగే వరకు బాగా కలపాలి. ఇలా కలిపిన నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి.
ఈ విధంగా రోజుకు మూడు లేదా నాలుగు సార్లు చేయడం వల్ల పంటి నొప్పులు, పిప్పి పళ్ల వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి. ఎటువంటి టూత్ పేస్ట్ లను, మందులను వాడకుండానే సహజ సిద్దంగా పంటి నొప్పి సమస్య నుండి మనం బయటపడవచ్చు. ఈ విధంగా రోజూ చేయడం వల్ల దంతాల నొప్పి త్వరగా తగ్గుతుంది. పిప్పి పన్ను బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. వేలకు వేలు ఖర్చు చేసి చికిత్స తీసుకునే బదులు ఈ సహజసిద్ధమైన చిట్కాను పాటిస్తే దంతాల నొప్పి సమస్య తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. కేవలం జామ ఆకులను ఉపయోగించి పైన చెప్పిన విధంగా చేయడం వల్ల అన్ని రకాల నోరు, దంతాల సమస్యల నుంచి బయట పడవచ్చు.