Hair Fall Remedy : జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా.. ఒక్కసారి దీన్ని తలకి రాస్తే.. జీవితంలో ఇక జుట్టు ఊడదు..

Hair Fall Remedy : మ‌న అందంగా క‌న‌బ‌డ‌డంలో జుట్టు ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. చిన్న వ‌య‌సులోనే జుట్టు తెల్ల‌బ‌డ‌డం వ‌ల్ల పెద్ద వారిలాగా క‌నిపిస్తారు. దీంతో చాలా మంది న‌లుగురిలోకి వెళ్ల‌డానికి ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఎన్నో రకాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఇంటి చిట్కాను ఉప‌యోగించి ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా త‌క్కువ ఖర్చులో జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

ఈ చిట్కా జుట్టుకు దివ్యౌష‌ధంలా ప‌ని చేస్తుంది. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు కుదుళ్లు బ‌లంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. తెల్ల జుట్టు న‌ల్ల‌బ‌డుతుంది. జుట్టును అందంగా, ఆరోగ్యంగా మార్చే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేయ‌డానికి మ‌నం క‌రివేపాకును, గుంట‌గ‌ల‌గ‌రాకు లేత ఆకుల‌ను, పుల్ల‌టి పెరుగును ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఇవి అన్నీ కూడా మ‌న‌కు స‌హ‌జ సిద్దంగా ల‌భించే ప‌దార్థాలే. ఈ చిట్కా కోసం మ‌నం ఎండిన గుంట‌గ‌ల‌గ‌రాకును కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు.

Hair Fall Remedy follow this one very effective and natural
Hair Fall Remedy

ముందుగా క‌రివేపాకు, గుంట‌గ‌ల‌గ‌రాకును శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లా చేసుకోవాలి. త‌రువాత దాలిలో పెరుగును వేసి మ‌ర‌లా మిక్సీ ప‌ట్టుకున్ని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత జుట్టును శుభ్రంగా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. త‌రువాత పాయ‌లు తీసుకుంటూ జుట్టుకంత‌టికి ఈ మిశ్ర‌మాన్ని ప‌ట్టించాలి. త‌రువాత కుదుళ్ల‌కు ప‌ట్టేలా మ‌ర్దనా చేయాలి. గంట త‌రువాత ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో లేదా హెర్బ‌ల్ షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది.

జుట్టు కుదుళ్లు గట్టిప‌డి జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి బ‌య‌ట అధిక ధ‌ర‌ల‌కు ల‌భించే ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌నూ వాడ‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే త‌యారు చేసుకున్న ఈ మిశ్ర‌మాన్ని వాడ‌డం వ‌ల్ల మ‌నం అద్భుత ప్ర‌యోజాన‌ల‌ను పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts