Hair Growth Tip : జుట్టు ఒత్తుగా, నల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి మనలో చాలా మంది అనేక రకాల జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జుట్టు రాలడం, జుట్టు పలుచబడడం, చుండ్రు, జుట్టు కుదుళ్లు బలహీనపడడం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడే వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. జుట్టు సమస్యలు తలెత్తడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన, పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం ఇలా వివిధ కారణాల చేత జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తుతు ఉంటాయి. ఇటువంటి జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఒక చక్కటి చిట్కాను ఇంట్లోనే తయారు చేసుకుని వాడడం వల్ల చాలా సులభంగా జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఈ చిట్కాను వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు సమస్యలను తగ్గించి జుట్టును చక్కగా పెంచే ఆ చిట్కా ఏమిటి.. ఆ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం మెంతులను, కాళోంజి విత్తనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. మెంతుల్లో అలాగే కాళోంజి విత్తనాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే వీటిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇవి మన జుట్టుకు బలాన్ని చేకూర్చి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల మెంతులను, 2 టీ స్పూన్ల కాళోంజి విత్తనాలను వేసి ఈ నీటిని 15 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత ఇందులో నిమ్మరసం వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీళ్లు చల్లగా అయిన తరువాత ఈ నీటిని స్ప్రే బాటిల్ లో వేసుకుని జుట్టు కుదుళ్లపై స్ప్రే చేసుకోవాలి లేదా ఆ నీటిలో దూదిని ముంచి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. తరువాత ఈ నీరు జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా సున్నితంగా మర్దనా చేసుకోవాలి. దీనిని 45 నిమిషాల నుండి గంట వరకు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో లేదా హెర్బల్ షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు ఈ చిట్కాను పాటించడం వల్ల మనం జుట్టును ఒత్తుగా పెంచుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఉపయోగించిన మెంతులను, కాళోంజి విత్తనాలను మిక్సీ పట్టుకుని హెయిర్ ప్యాక్ గా కూడా ఉపయోగించవచ్చు. జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ విధంగా మెంతులను, కాళోంజి విత్తనాలను ఉపయోగించడం వల్ల ఒత్తైన, పొడవైనా, కాంతివంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.