Bloating : మనం భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరంగా ఉన్నట్లయితే మన కడుపులో ఏదో సమస్య ఉన్నట్టు భావించాలి. వైద్యుడిని సంప్రదించకుండా ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సోంపు గింజలు
సోంపు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. భోజనం చేసిన తరువాత సోంపు గింజలు తినడం ద్వారా కడుపు ఉబ్బరం నుండి బయట పడవచ్చు. రోజూ సోంపు గింజలను తినడం ద్వారా కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు తగ్గుతాయి.
2. అవిసె గింజలు
కడుపు ఉబ్బరం నుండి బయట పడడానికి అవిసె గింజలు ఎంతో సహాయపడతాయి. అవిసె గింజలను రాత్రంతా నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
3. యాలకులు
యాలకులు మనం తినే ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. భోజనం చేసిన తరువాత యాలకులను నమలడం ద్వారా కడుపు ఉబ్బరం నుండి ఎంతో ఉపశమనం పొందవచ్చు.
4. తేనె
భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరాన్ని తగ్గించే వాటిల్లో తేనె ఒకటి. భోజనం తరువాత రోజూ తక్కువ మొత్తంలో తేనె తినడాన్ని అలవాటుగా చేసుకోవాలి. దీని వలన కడుపు ఉబ్బరమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
5. వాము, నల్ల ఉప్పు
వంట గదిలో సులువుగా లభించే వాటిల్లో వాము, నల్ల ఉప్పు ఒకటి. ఒక గ్లాసు నీటిలో 2 టీస్పూన్‌ల వాము, సగం టీస్పూన్ నల్ల ఉప్పు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడ కట్టి రోజూ తాగడం ద్యారా కడుపు ఉబ్బరం తగ్గుతుంది.